బ్రేకింగ్

breaking
04 May 2024 | 22:47 IST

బాదేసిన డుప్లెసిస్‌.. బెంగళూరు హ్యాట్రిక్‌ గెలుపు

బెంగళూరు: ఐపీఎల్‌-2024లో బెంగళూరు జట్టుకు హ్యాట్రిక్‌ విన్‌. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 148 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్‌కు దిగిన బెంగళూరు.. 13.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ పూర్తి చేసింది. బెంగళూరు బ్యాటర్లలో డుప్లెసిస్ (64; 23 బంతుల్లో), విరాట్‌ కోహ్లీ (42; 27 బంతుల్లో) దంచికొట్టారు. గుజరాత్‌ బౌలర్లలో జోష్‌ లిటిల్‌ 4, నూర్‌ అహ్మద్‌ 2 వికెట్లు తీశారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ 19.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటయ్యింది. షారూఖ్‌ (37), తెవాటియా (35) రాణించారు. బౌలర్లలో సిరాజ్‌, యశ్‌ దయాల్‌, విజయ్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా, కామెరాన్‌, కర్ణ్‌ శర్మ చెరో వికెట్‌ తీశారు.

మరిన్ని

తాజా వార్తలు