close
బాలీవుడ్
అభిషేక్‌ పోస్ట్‌.. నిరుద్యోగి అని కామెంట్‌ చేసిన నెటిజన్‌

ముంబయి: బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ పెట్టిన పోస్ట్‌కు ఓ నెటిజన్‌ నిరుద్యోగి అంటూ కామెంట్‌ చేశారు. తాజాగా అభిషేక్‌ ఇన్‌స్టా వేదికగా సోమవారం ఓ స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని పోస్ట్‌ చేశారు. ‘జీవించడానికి గల ప్రయోజనాన్ని తెలుసుకోండి. జీవితానికి ఓ గోల్‌ను ఏర్పాటు చేసుకోండి. అసాధ్యమైన దానిని సాధించి.. అది అసాధ్యమైన పని కాదని ఈ ప్రపంచానికి తెలియజేయండి’ అని పోస్ట్‌ పెట్టారు. దీనిపై  ఓ నెటిజన్‌ ‘సోమవారం కూడా సంతోషంగా ఉండే వ్యక్తిని మనం ఏమంటామ్‌? నిరుద్యోగి..!’ అని కామెంట్‌ చేశాడు. ఈ కామెంట్‌పై స్పందించిన అభిషేక్‌.. ‘మీ కామెంట్‌తో విభేధిస్తున్నాను. కొందరు వ్యక్తులు ఏ పని చేసినా తాము చేసే పనిని పూర్తి ఇష్టంతో చేస్తారు.’ అని హుందాగా రిప్లై ఇచ్చారు.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.