‘ఐస్‌క్రీం’ను ఇలా వెరైటీగా సర్వ్‌ చేసేద్దాం!

ఈ వేసవిలో ఇంటికెవరైనా అతిథులొస్తే చల్లచల్లగా ఐస్‌క్రీం అందించడం మనకు అలవాటే! అయితే ఇందుకోసం చాలామంది ఇంట్లో ఉండే స్టీల్‌ లేదా ప్లాస్టిక్‌ బౌల్స్‌ని ఎంచుకుంటారు. ఈసారి కాస్త వెరైటీగా ప్రయత్నించాలనుకుంటున్నారా? మీ కోరిక మేరకే ప్రస్తుతం మార్కెట్లో విభిన్న డిజైన్ల....

Published : 02 Apr 2023 11:42 IST

ఈ వేసవిలో ఇంటికెవరైనా అతిథులొస్తే చల్లచల్లగా ఐస్‌క్రీం అందించడం మనకు అలవాటే! అయితే ఇందుకోసం చాలామంది ఇంట్లో ఉండే స్టీల్‌ లేదా ప్లాస్టిక్‌ బౌల్స్‌ని ఎంచుకుంటారు. ఈసారి కాస్త వెరైటీగా ప్రయత్నించాలనుకుంటున్నారా? మీ కోరిక మేరకే ప్రస్తుతం మార్కెట్లో విభిన్న డిజైన్లతో కూడిన ఐస్‌క్రీం బౌల్స్‌ స్పూన్లతో సహా సిద్ధంగా ఉన్నాయి.

అచ్చం ఎడిబుల్‌ కోన్‌లా, కప్స్‌ మాదిరిగా, సులభంగా పట్టుకోవడానికి వీలుగా స్టాండ్‌ అనుసంధానించి ఉన్నవి, కొబ్బరి చిప్పలతో రూపొందించినవి, చెక్క/మట్టి/సెరామిక్‌.. వంటి సహజసిద్ధమైన మెటీరియల్స్‌తో విభిన్న డిజైన్లలో తయారైనవి.. ఇలా చెప్పుకుంటూ పోతే మార్కెట్లో ఉన్న డిజైన్లకు కొదవే లేదు. వీటికి అనుసంధానంగా వచ్చిన కొన్ని స్పూన్లూ బౌల్‌కు మ్యాచింగ్‌గా భలే ఆకట్టుకుంటున్నాయి.

ఇవే కాదు.. కోన్‌, స్టిక్‌ తరహా ఐస్‌క్రీమ్స్‌ని ఆకర్షణీయంగా సర్వ్‌ చేయడానికి వీలుగా వెరైటీ స్టాండ్స్‌ కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. బయటి నుంచి తెచ్చిన లేదంటే ఇంట్లోనే తయారుచేసిన ఐస్‌క్రీమ్స్‌ని వాటికుండే రంధ్రాల్లో/స్టాండ్‌లో అమర్చి సర్వ్‌ చేస్తే అతిథుల్ని ఇట్టే సర్‌ప్రైజ్‌ చేయచ్చు. సులభంగా పట్టుకోవడానికి వీలుగా సాసర్‌తో పాటుగా వచ్చిన బౌల్స్ కూడా మరికొన్నున్నాయి. అలాంటి వెరైటీ ఐస్‌క్రీం బౌల్స్‌/స్టాండ్స్‌పై మీరూ ఓ లుక్కేసేయండి మరి!

Photos: Amazon.in

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్