ఈ మార్షల్ ఆర్ట్స్‌తో ప్రయోజనాలెన్నో.. అందుకే నేర్చుకుంటున్నా!
కొంతమంది వారి కెరీర్‌తో సంబంధం ఉన్నా, లేకపోయినా కొత్త కొత్త విద్యలు నేర్చుకోవడానికి ఉత్సుకత చూపుతారు. అదే మరికొందరు తమ కెరీర్లో దూసుకుపోవడానికి ఎంత కష్టమైన నైపుణ్యమైనా ఇష్టంగా
కొంతమంది వారి కెరీర్‌తో సంబంధం ఉన్నా, లేకపోయినా కొత్త కొత్త విద్యలు నేర్చుకోవడానికి ఉత్సుకత చూపుతారు. అదే మరికొందరు తమ కెరీర్లో దూసుకుపోవడానికి ఎంత కష్టమైన నైపుణ్యమైనా ఇష్టంగా నేర్చేసుకుంటారు. ఏదేమైనా కొత్త విద్య నేర్చుకోవడంలో ఉన్న సంతృప్తే వేరు అంటోంది మంచు వారి ఆడపడుచు లక్ష్మీ ప్రసన్న. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టే ఈ ముద్దుగుమ్మ.. తన వర్కవుట్ ఫొటోలు, వీడియోలను తరచూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే తాను కలరిపయట్టు యుద్ధ విద్య నేర్చుకుంటోన్న వీడియోను తాజాగా ఇన్‌స్టాలో పంచుకుంది. ఈ నేపథ్యంలో ఈ మార్షల్ ఆర్ట్‌తో చేకూరే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం రండి..
ఇష్టపడితే కష్టమనిపించదు!
మనం చేసే ఏ పనైనా ఇష్టపడితే.. అందులోని కష్టం తెలియకుండానే సక్సెస్ సాధించచ్చంటోంది మంచు లక్ష్మి. కలరిపయట్టు వ్యాయామం సాధన చేస్తోన్న వీడియోను ఇన్‌స్టాలో పంచుకున్న ఆమె.. ‘కొత్త విషయం నేర్చుకున్నప్పుడల్లా మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుంటుంది. కేరళ ప్రాచీన యుద్ధ విద్య అయిన కలరిపయట్టు సాధన చేస్తున్నా. ఇది నా మనసుకు ఎంతో నచ్చింది. అందుకే రోజూ క్రమం తప్పకుండా ఇది ప్రాక్టీస్ చేస్తున్నా. ఇది ఆరంభం మాత్రమే!’ అంటోందీ టాలీవుడ్ బ్యూటీ. ఇక ఈ ముద్దుగుమ్మ వీడియో చాలా స్ఫూర్తిదాయకంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
గతంలో వీళ్లు కూడా!
అయితే కేరళలో పుట్టిన ఈ ప్రాచీన యుద్ధ విద్యలో నిష్ణాతులు కావాలంటే ఎంతో కష్టపడాలంటున్నారు నిపుణులు. అయితే సాధన చేస్తున్న కొద్దీ వేగం, శారీరక సత్తువను పెంపొందించుకోవచ్చంటున్నారు. ఇక ఇప్పుడు మంచు లక్ష్మితో పాటు గతంలో.. దియా మీర్జా, అసిన్, దీపికా పదుకొణె, శిల్పా శెట్టి, కంగనా రనౌత్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అదితీ రావ్ హైదరి, శ్రద్ధా కపూర్.. వంటి పలువురు తారలు తమ అభిరుచులకు అనుగుణంగా/సినిమాల్లో తమ పాత్రల కోసం ఇలాంటి యుద్ధ విద్యల్ని నేర్చుకొని సత్తా చాటారు. వీరిలో కొంతమంది ఆయా మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్ బెల్ట్ కూడా సంపాదించారు.
ఆరోగ్యానికి.. ఫిట్నెస్కీ!
ఏదేమైనా ఈ యుద్ధ విద్యను ట్రైనర్ సహాయంతో దశల వారీగా నేర్చుకోవచ్చు. ముందు శరీరం ఫ్లెక్సిబుల్‌గా మారేందుకు దోహదం చేసే వ్యాయామాలతో మొదలై.. ఆపై కర్రలు, కత్తులు.. వంటి వాటితో ఈ యుద్ధ కళలో నైపుణ్యం సాధించచ్చంటున్నారు నిపుణులు. ఇటు శక్తి సామర్థ్యాలు పెంచడంతో పాటు, అటు ఆరోగ్యం-ఫిట్నెస్ పరంగానూ ఈ వ్యాయామం బోలెడన్ని ప్రయోజనాల్ని చేకూర్చుతుందని చెబుతున్నారు.
* కలరిపయట్టు యుద్ధ విద్యలో భాగంగా చేతులు, కాళ్లను కదిలించడం.. శరీరాన్ని విల్లులా వంచడం, ఎగిరి దూకడం.. వంటి పలు భంగిమల వల్ల శరీరంలోని ప్రతి అవయవానికీ చక్కటి వ్యాయామం లభిస్తుంది. తద్వారా శరీరం ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది.
* అలాగే ఈ యుద్ధ కళ సాధన చేస్తున్న క్రమంలో కండరాలకు, ఎముకలకు మంచి వ్యాయామం అందుతుంది. తద్వారా కండరాల్లో, ఎముకల్లో ఏవైనా గాయాలు, వాపు.. వంటివి ఉంటే త్వరగా మానిపోతాయంటున్నారు నిపుణులు.
* ఇందులో భాగంగా శత్రువు కదలికలను పసిగట్టి వారి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి వేగంగా స్పందించాల్సి వస్తుంది. ఈ క్రమంలో మన ఏకాగ్రత, వేగం పెరుగుతాయి. ముఖ్యంగా అమ్మాయిలకు ఈ కళ ఆత్మరక్షణ విద్యగా ఉపకరిస్తుందని చెప్పచ్చు.
* కొంతమంది ఏ పని చేయాలన్నా బద్ధకిస్తుంటారు. అలాంటివారు బద్ధకాన్ని వదిలించుకోవాలంటే ఈ మార్షల్ ఆర్ట్ సరైందని సూచిస్తున్నారు నిపుణులు.
* శారీరక సత్తువను, దేహ దారుఢ్యాన్ని, ఓపికను పెంచడంలో ఈ యుద్ధకళను మించింది లేదు.
* కలరిపయట్టులో శిక్షణ పొందే క్రమంలో కొన్ని యోగాసనాలు కూడా నేర్పిస్తారు. అవి శారీరక, మానసిక ఒత్తిళ్లను మటుమాయం చేయడంలో బాగా సహకరిస్తాయి. తద్వారా సానుకూల దృక్పథం అలవడడంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపవుతుంది.
* బరువు తగ్గడానికి, చక్కటి శరీరాకృతిని సొంతం చేసుకోవడానికి, జీవక్రియల పనితీరును మెరుగుపరచుకోవడానికి ఈ యుద్ధ విద్యకు సాటి మరొకటి లేదు.
* ఈ రోజుల్లో మహిళలు ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాంటప్పుడు మీరు ముందే ఈ యుద్ధ విద్యలో నైపుణ్యం సాధించి ఉంటే మీరే ఓ కోచింగ్ ఇనిస్టిట్యూట్ పెట్టుకొని ఇతర మహిళలకు ఇందులో శిక్షణ ఇవ్వచ్చు. ఇది మీకు మంచి ఉపాధి మార్గంగానూ ఉపయోగపడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- అడ్డిగ... అందాల నగ!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!