శుభ్రం చేయడం ఇక తేలిక...

కేకులూ, బిస్కెట్లు వంటి బేకింగ్‌ పదార్థాలు చేయాలనిపిస్తే చిక్కంతా గుడ్లూ, పిండిని గిలకొట్టడంలోనే ఉంటుంది. అలా గిలకొట్టిన తర్వాత...

Updated : 09 Dec 2022 15:24 IST

కేకులూ, బిస్కెట్లు వంటి బేకింగ్‌ పదార్థాలు చేయాలనిపిస్తే చిక్కంతా గుడ్లూ, పిండిని గిలకొట్టడంలోనే ఉంటుంది. అలా గిలకొట్టిన తర్వాత బీటర్‌ని శుభ్రం చేయడం మామూలు విషయం కాదు. బీటర్‌లోని ఒక్కో తీగని కడగాలంటే విసుగొచ్చేస్తుంది. ఆ పనిని శుభ్రం చేయడానికి వచ్చిన పరికరమే విస్క్‌ వైపర్‌. చూడ్డానికి రంధ్రాలతో చిన్న పళ్లెం మాదిరిగా కనిపిస్తుంది. బీటర్‌కి ముందుగానే ఈ విస్క్‌వైపర్‌ని తొడిగి ఆ తర్వాత మీ పని కానివ్వండి. పనంతా అయిపోయిన తర్వాత ఆ విస్క్‌ వైపర్‌ని తీసేస్తే చాలు. దానికి అంటిన పిండి అంతా సులభంగా తొలగిపోతుంది. ఆ తర్వాత శుభ్రపరచుకోవడం చాలా తేలికవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్