అతనితో బ్రేకప్.. అన్నీ ఉన్నా సంతోషంగా లేను..!

నాకు పాతికేళ్లు. ఉన్నత విద్యను అభ్యసించి మంచి సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. అర్ధం చేసుకునే కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా ఉన్నారు. ఇలా అన్నీ ఉన్నా నా మనసు మాత్రం ప్రశాంతంగా లేదు.

Published : 03 Feb 2024 12:37 IST

నాకు పాతికేళ్లు. ఉన్నత విద్యను అభ్యసించి మంచి సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. అర్ధం చేసుకునే కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా ఉన్నారు. ఇలా అన్నీ ఉన్నా నా మనసు మాత్రం ప్రశాంతంగా లేదు. ఏదో తెలియని వెలితి నన్ను వేధిస్తోంది. ఆరు నెలల క్రితం నాకు ఓ వ్యక్తితో బ్రేకప్‌ అయ్యింది. బహుశా దీనివల్లే ఇలా అవుతోం దేమోననిపిస్తోంది. నా బాధను చూసి స్నేహితులు స్వీయ ప్రేమను అలవరచుకోమని సూచించారు. కానీ, ఎన్ని ప్రయత్నాలు చేసినా నాలో అసంతృప్తి మాత్రం పోవడం లేదు. నేను తిరిగి సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సంతోషంగా ఉండలేకపోతున్నానని చెబుతున్నారు. అందుకు మీరు అనుకున్నట్టుగా బ్రేకప్‌ కూడా ఒక కారణమయ్యే అవకాశం లేకపోలేదు. అయితే మీ అసంతృప్తికి అసలు కారణం తెలియకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా పరిష్కారం లభించదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.

మీ బాధను గమనించిన స్నేహితులు స్వీయ ప్రేమను అలవరచుకోమని చెప్పారన్నారు. సాధారణంగా ఇలాంటి సమయంలో మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం ఎంతో అవసరం. అయితే దాని ఫలితం వెంటనే కనిపించదన్న విషయన్ని కూడా అర్థం చేసుకోండి. స్వీయ ప్రేమ అనేది సమస్య వచ్చినప్పుడు మాత్రమే కాదు.. దాన్ని జీవనశైలిలో భాగం చేసుకుని నిత్యం పాటించాలి. అప్పుడే మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. అలాగే బ్రేకప్‌ వంటి బాధ నుంచి బయటపడడానికి కొంత సమయం పడుతుందన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోండి.

మీకు ఈ సమస్య ఎప్పటినుంచి ఉందో చెప్పలేదు. ఒకవేళ బ్రేకప్‌ ముందు నుంచే మీరు ఈ సమస్యతో బాధపడుతున్నారా? అనే విషయాన్ని కూడా పరిశీలించుకోవడం అవసరం. ఒకవేళ ముందు నుంచే మీకు ఈ సమస్య ఉంటే నిపుణులతో కౌన్సెలింగ్‌ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదు.. బ్రేకప్‌ తర్వాత నుంచే సమస్య మొదలైనట్లయితే- ఆ బాధ నుంచి బయటపడడానికి మీ ప్రయత్నాలను మరికొంతకాలం పాటు కొనసాగించండి. అప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపించకపోతే మానసిక నిపుణులను సంప్రదించండి. మీ సమస్య తప్పకుండా పరిష్కారమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్