సుఖ ప్రసవం కోసం నేనేం చేయాలి?

నేను ఏడో నెల గర్భవతిని. నాకు సిజేరియన్‌ అంటే ఇష్టం లేదు. నార్మల్‌ డెలివరీ కావాలంటే ఏం చేయాలి? - ఓ సోదరి

Published : 23 Jan 2024 12:10 IST

నేను ఏడో నెల గర్భవతిని. నాకు సిజేరియన్‌ అంటే ఇష్టం లేదు. నార్మల్‌ డెలివరీ కావాలంటే ఏం చేయాలి? - ఓ సోదరి

జ. నార్మల్‌ డెలివరీ కావాలనుకోవడం మంచి ఆలోచన. సాధారణంగా ఏ డాక్టర్ అయినా అనవసరంగా సిజేరియన్‌ చేయరు. తల్లికి కానీ, బిడ్డకు కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే సిజేరియన్‌ చేస్తారు. అయితే ‘నాకు సిజేరియన్‌ అంటే ఇష్టం లేదు’ అనే భావనను ముందు మీరు మీ మనసులో నుంచి తొలగించండి. ఒకవేళ నార్మల్‌ డెలివరీనే అవుతుందని మీరు నమ్మకంతో ఉన్నా బేబీకి ఏదైనా సమస్య వచ్చి సి-సెక్షన్ చేయాల్సి వస్తే అదే మీ మనసుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కొన్ని సందర్భాల్లో అవసరమైనప్పుడు సిజేరియన్‌ చేయాల్సి రావచ్చు.

ఇక నార్మల్‌ డెలివరీ కావాలంటే చక్కటి ఆహార నియమాలు పాటిస్తూనే.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అలాగే ప్రసవానికి ముందు కూడా కొన్ని రకాల నొప్పులు వస్తుంటాయి. అవన్నీ ప్రసవ నొప్పులు కావు. కాబట్టి డాక్టర్‌ సలహాలు పాటిస్తూ.. డెలివరీ చివరి తేదీ (40 వారాలు) వరకు వేచి చూడండి. దానివల్ల నార్మల్‌ డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏడో నెల గర్భిణి కాబట్టి కొత్తగా ఎలాంటి వ్యాయామాలు ప్రయత్నించకండి. ఒకవేళ ఇంతకుముందు నుంచి ఏవైనా వ్యాయామాలు చేస్తున్నట్లయితే వాటిని కొనసాగించండి. అయితే వాకింగ్‌ మాత్రం ఎప్పుడైనా చేయచ్చు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా పిండం ఎదుగుదల సంతృప్తికరంగా ఉంటే ప్రసవమయ్యే దాకా వాకింగ్‌ని కొనసాగించవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్