చిన్నారులకూ ఒత్తిడి
తోబుట్టువులతోనూ కలవకుండా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడే పిల్లలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు గుర్తించాలంటున్నారు మానసిక నిపుణులు.
తోబుట్టువులతోనూ కలవకుండా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడే పిల్లలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు గుర్తించాలంటున్నారు మానసిక నిపుణులు. చిన్నపిల్లలకు ఏం ఒత్తిళ్లుంటాయి అనుకోకుండా ఆ ఆలోచనల నుంచి వాళ్లను బయటకు తీసుకురాకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
గుర్తించి... చిన్నారుల ప్రవర్తనలో మార్పును తల్లిదండ్రులు గుర్తించ గలగాలి. కారణాల్నీ కనిపెట్టాలి. ఇంటివాతావరణం, చదువులు, స్నేహితుల ప్రభావం వంటి పలు అంశాలు పిల్లల్లో ఒత్తిడికి దారితీస్తాయి. వీలైనంత ఎక్కువ సమయాన్ని కేటాయించగలిగితే వారి మనసును అర్థం చేసుకోవచ్చు. ఏ విషయం ఆ చిన్ని మనసును బాధిస్తోందో గుర్తించగలిగితే తేలికగా పరిష్కరించొచ్చు. వారి మనసులోని ఒత్తిడిని బయటపెట్టడానికి తగిన వాతావరణాన్ని కల్పించాలి. కోపాన్ని ప్రదర్శించకుండా చిన్నారులతో మృదువుగా మాట్లాడాలి. అప్పుడే పిల్లలు వారి మనసులోని మాటను ధైర్యంగా చెప్పగలుగుతారు. ఒత్తిడికి కారణాన్ని త్వరగా గుర్తించి దూరం చేయడానికి ప్రయత్నిస్తే చాలు.
ఉత్సాహాన్ని నింపి.. చదువు విషయంలో ఒత్తిడికి గురి అవుతుంటే వారికి ధైర్యం చెప్పాలి. తెలియని పాఠాలను విడమర్చి చెప్పడం, చిన్నచిన్న టాస్క్‌ల రూపంలో పాఠ్యాంశాలను తేలికగా అర్థమయ్యేలా చెప్పడం, వారిలో ఉత్సాహం నింపడం ద్వారా భయాన్ని మటుమాయం చేయొచ్చు. అప్పుడు వాళ్లే రాణిస్తారు. మార్కులను కొలమానంగా చూడొద్దు. ఇతర పిల్లలతో పోల్చొద్దు. అమ్మానాన్నలు ఇచ్చే చిన్నచిన్న ప్రశంసలే చిన్నారులను మరో అడుగు ముందుకు వేసేలా ప్రోత్సహిస్తాయి.
సమయాన్ని కేటాయిస్తూ.. ఫోన్, టీవీకి అతుక్కుపోకుండా ఉండాలంటే... చదువుతోపాటు ఆటలకూ కొంత సమయాన్ని కేటాయించాలి. ఇలా దేనికి దానికి సమయాన్ని విభజించుకోవడం, దాన్ని అమలు చేయడం నేర్పించాలి. ఇందులో ఆసక్తి చూపించకపోయినా, వారి కోసం పెద్ద వాళ్లు అవుట్డోర్ గేమ్స్ ఆడటానికి ప్రయత్నించాలి. తల్లిదండ్రులు ఉత్సాహంగా మైదానంలో ఆడుతుంటే క్రమేపీ చిన్నారుల్లోనూ మార్పు కనిపిస్తుంది. అంతేకాదు, తోటి పిల్లలతో కలిసి ఆడుకునే వాతావరణాన్ని కల్పిస్తే చాలు. పిల్లల్లో శారీరక, మానసికారోగ్యం పెంపొందుతుంది. ఇది వారిని ఒత్తిడి నుంచి దూరం చేసి, నిత్యం ఉత్సాహవంతులుగా ఉండేలా చేస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- Met Gala 2024: గ్రీన్ కార్పెట్‌పై తారల సొగసులు!
- మండే ఎండల్లో... ఫ్రెష్‌గా ఉండాలంటే..!
- ఉంగరం... ఆడంబరం!
- మేకప్ మరకలా?
- ఈ వేసవి సమస్యలకు.. ఇలా చెక్ పెట్టేయండి!
ఆరోగ్యమస్తు
- నలభై దాటాక.. ఇమ్యూనిటీ పెరగాలంటే..!
- వేడికి... సహజ మంత్రం!
- No Diet Day: నచ్చింది తిందాం.. మనల్ని మనం ప్రేమించుకుందాం!
- ఆడుతూ పాడుతూ... ఆరోగ్యంగా!
- ఏకాగ్రతను పెంచే బంతాట
అనుబంధం
- అందుకే.. కాస్త రొమాన్స్ కూడా జోడించాల్సిందే..!
- ఆపొద్దు.. ఎగరనిద్దాం!
- వద్దంటే.. ఆ విషయం మా ఇంట్లో చెప్తానని బెదిరిస్తున్నాడు..!
- టిక్ టాక్ టో ఆడిద్దామా!
- పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారా?
యూత్ కార్నర్
- ఆ గౌను కోసం... పదివేల గంటలు!
- ఆ లెహెంగా తయారీకి 1400 గంటలు!
- వీగన్ ఉత్పత్తులతో... రూ.830 కోట్ల వ్యాపారం!
- ఈ అమ్మాయిలు... యునిసెఫ్ అంబాసిడర్లు!
- నవ్వుల మారాణులు!
'స్వీట్' హోం
- వాషింగ్ మెషీన్ వాడేద్దామిలా!
- పనిభారం ఉండదిక..!
- అప్పులు తెమ్మంటున్నాడు... విడాకులు తీసుకోనా?
- టైల్స్ మధ్య మురికి.. పోవాలంటే!
- మొక్కలు... సురక్షితమిలా!
వర్క్ & లైఫ్
- భర్త నచ్చకపోతే విడాకులు.. గ్రాండ్‌గా ‘పార్టీ’ కూడా చేసుకుంటారు!
- పెదవి కొరుకుతున్నారా..!
- ఓటు కోసం... వేల మైళ్లు
- Elections 2024: ఎన్నికల బరిలో అందాల తారలు!
- నవ్వు... నాయకత్వం!