ఆహారం త్వరగా పాడవుతుంటే..

ఎండలు పెరుగుతున్నాయి. వేడికి త్వరగా ఆహారం పాడవడం ఈ కాలంలో పెద్ద సమస్య. దీన్ని ఎలా అధిగమించవచ్చంటే..

Updated : 31 Mar 2022 12:37 IST

ఎండలు పెరుగుతున్నాయి. వేడికి త్వరగా ఆహారం పాడవడం ఈ కాలంలో పెద్ద సమస్య. దీన్ని ఎలా అధిగమించవచ్చంటే..

వెల్లుల్లిలో యాంటీ వైరల్‌ గుణాలెక్కువ. వంటకాల్లో దీనికి ప్రాధాన్యమివ్వండి. ఆహారం త్వరగా పాడవకుండా, ఎక్కువ సేపు నిల్వ ఉండేలా కాపాడుతుంది. ఇది కడుపులోని బ్యాక్టీరియా వంటి సూక్ష్మక్రిములతోనూ పోరాడగలదు.

రుచికి ఉప్పు తప్పనిసరి. ఈ కాలంలో మాత్రం పింక్‌ లేదా హిమాలయన్‌ సాల్ట్‌ను  వంటల్లో వాడండి. ఇవి సహజ నిల్వ పదార్థాలుగా పనిచేస్తాయి

సిట్రిక్‌ ఆసిడ్‌ కూడా సహజ నిల్వ పదార్థమే. ఇది నిమ్మ ద్వారా పుష్కలంగా లభిస్తుంది. చల్లవైనా, ఉడికించిన వైనా కొద్దిగా నిమ్మరసాన్ని కలపండి. ఆహారం పాడవకుండా చూస్తుంది. లేదూ కాస్త వెనిగర్‌ని కలపండి. ఇది ఆహారాన్ని కుళ్లింపజేసే సూక్ష్మజీవులను చంపడమే కాదు రుచిని పెంచడంలోనూ సాయపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్