కంటికి కాఫీ

కంప్యూటర్‌పై అధిక సమయం పనిచేసినా, సరిగా నిద్ర పోకపోయినా కంటిచుట్టూ నల్లని వలయాలు మొదలవుతాయి. ఈ సమస్యకు సహజసిద్ధమైన పదార్థాలతోనే చెక్‌ పెట్టొచ్చు. కళ్లను తాజాగా, మెరిసేలా చేసుకోవచ్చు.

Updated : 12 Dec 2021 04:20 IST

కంప్యూటర్‌పై అధిక సమయం పనిచేసినా, సరిగా నిద్ర పోకపోయినా కంటిచుట్టూ నల్లని వలయాలు మొదలవుతాయి. ఈ సమస్యకు సహజసిద్ధమైన పదార్థాలతోనే చెక్‌ పెట్టొచ్చు. కళ్లను తాజాగా, మెరిసేలా చేసుకోవచ్చు.

* రెండు చెంచాల బ్లాక్‌టీ పొడిని కప్పు నీటిలో వేసి 5 నిమిషాలపాటు మరిగించి చల్లార్చి వడకట్టాలి. ఇందులో చెంచా తేనె వేసి ఆరనివ్వాలి. ఈ మిశ్రమంలో గుండ్రంగా కట్‌ చేసి ఉంచిన కాటన్‌ ప్లెయిన్‌ ప్యాడ్స్‌ ముంచి ఆరబెట్టాలి. కొంచెం ఆరిన తర్వాత ఫ్రిజ్‌లో భద్రపరిస్తే సరి. అవసరమైనప్పుడు వీటిని కంటిపై ఉంచి పది నిమిషాలయ్యాక శుభ్రం చేస్తే కంటి అలసట దూరమై, ఉపశమనం కలుగుతుంది.

* మెత్తగా రుబ్బిన ఒక కీర మిశ్రమంలో చెంచా తేనె కలపాలి. దీనిలో గుండ్రని ప్లెయిన్‌ కాటన్‌ ప్యాడ్స్‌ను ముంచి పై విధంగానే ఆరబెట్టి ఫ్రిజ్‌లో భద్రపరచాలి. నిద్రపోయే ముందు కంటిపై పది నిమిషాలుంచితే చాలు. కంటి చుట్టూ నల్లని వలయాలు, కళ్లు మండటం తగ్గుతాయి.

* చెంచా కాఫీ పొడిని కప్పు నీటిలో మరిగించి, చల్లార్చి వడకట్టాలి. దీంతో చేసిన ప్యాడ్స్‌ను ఆఫీస్‌ నుంచి వచ్చాక కంటిపై ఉంచుకుంటే విశ్రాంతి కలుగుతుంది. కంటికింద వాపు, మచ్చలు దూరమవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్