Updated : 26/03/2022 03:28 IST

ఉంగరాలపై భవనాలు..

అమ్మాయిల లేలేత వేళ్లకు సన్నగా, సొగసుగా ఉండే ఉంగరాలే పెట్టాలా? వాళ్లు అభిమానించే, నచ్చిన భవంతులను చెక్కిస్తే! ఇదే ఆలోచన వచ్చినట్టుంది తయారీదారులకు. అందుకే ఇలా వివిధ రకాల భవన నమూనాలను ఉంగరాలపై చెక్కేశారు. రకరకాల రాళ్లతో హంగులూ అద్దారు. చేతికి భారీతనాన్ని తెస్తూ చూడటానికైతే బాగున్నాయి. మరి ఆ బరువును తమ సుకుమారమైన వేళ్లు మోయగలుగుతాయా అన్నది అమ్మాయిలు ఆలోచించుకోవాలిక!

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని