కైరా.. మాయా సుందరి!
ఆమె ఓ ఇన్ఫ్లుయెన్సర్.. చూస్తున్నారుగా ... చాలా అందంగా ఉంటుంది. ఇన్‌స్టగ్రామ్‌లో జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్ల ఉత్పత్తుల పరిచయం, తన దినచర్య... అప్పుడప్పుడూ అభిమానులతో చాటింగ్ వంటివీ చేస్తుంటుంది. దీనిలో గొప్పేముంది అంటారా?
ఆమె ఓ ఇన్ఫ్లుయెన్సర్.. చూస్తున్నారుగా ... చాలా అందంగా ఉంటుంది. ఇన్‌స్టగ్రామ్‌లో జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్ల ఉత్పత్తుల పరిచయం, తన దినచర్య... అప్పుడప్పుడూ అభిమానులతో చాటింగ్ వంటివీ చేస్తుంటుంది. దీనిలో గొప్పేముంది అంటారా? ఆమె ఇన్స్టాలోకొచ్చి నాలుగు నెలలే! అనుసరించే వారి సంఖ్య దాదాపు లక్ష! అసలు విషయం ఏంటంటే... తను మనిషే కాదు!!
వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్స్.. మనకు కొత్త కానీ.. ఈ ట్రెండ్ విదేశాల్లో ఇప్పటికే మొదలైంది. ఊహాజనిత పాత్రలు.. కార్టూన్ క్యారెక్టర్లు ఎలాగో.. వీళ్లూ అంతే! కాకపోతే అచ్చంగా మనుషుల్ని పోలే ఉంటారు. నడక, వస్త్రధారణ మనలాగే ఉంటాయి. తమ దినచర్య, సంస్థల వ్యాపార ప్రకటనలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటుంటారు. పోస్టులు చూస్తే నిజమైన మనుషులే అనుకుంటాం. ఈ అమ్మాయీ అంతే. పేరు కైరా. మన దేశంలో తొలి వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్. హిమాన్షు గోయల్ అనే వ్యక్తి రూపొందించాడు. ఈ జనవరి 28న ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టింది. ఈమెను పూర్తిగా వ్యాపార ఆలోచనతోనే రూపొందించారు. తన పేరుతో ఫొటోలు, వీడియోలు పెట్టడానికి ప్రత్యేక బృందం ఉంటుంది. ఇప్పటి వరకూ పెట్టింది 21 పోస్టులే అయినా రోజుకు కనీసం వెయ్యి మంది కొత్త ఫాలోయర్లు చేరుతున్నారట. ‘బ్రాండ్ల ప్రచారంలో భాగంగా ప్రకటనలు తప్పనిసరి. వాటిని చిత్రీకరించడానికి దూర ప్రాంతాలకు వెళ్లాల్సొస్తుంది. ప్రయాణాలు, దుస్తులు, ఆహారం వగైరా అంతా ఖర్చు. ఇక్కడ ఆ ప్రాంతం ఫొటోకి 3డి సాయంతో ఈమెను జతచేస్తాం. వీళ్లకు వయసు పెరుగదు. పైగా వివాదాలకీ తావుండదు’ అని చెబుతున్నారు రూపకర్తలు. అలాంటివి ఏమైనా పొరబాటున ఎదురైనా సంస్థ నిపుణులే చూసుకుంటారు. పోస్టుల్లోని వీడియోలూ, చాటింగుల్లో గలగలా మాట్లాడేస్తోంటే.. చాలామంది నిజమైన అమ్మాయే అనుకుని మెసేజ్‌లూ పెడుతుంటారు. ఇటీవలే నిజాన్ని బయటపెట్టారు రూపకర్తలు. మాట్లాడటం వరకూ సరే కానీ... ప్రేమలో మాత్రం పడకండని సలహానిస్తున్నారు. చూసుకోండి మరి!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- అడ్డిగ... అందాల నగ!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- పెంపుడు తల్లి వేధింపులు.. విడిచిపెట్టి వెళ్లిపోవాలనుంది..!
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!