హెయిర్‌ సీరమ్‌ తయారు చేద్దామా?

త్వరగా చిక్కులు పోవడానికీ, జుట్టు పట్టుకుచ్చులా మెరవడానికీ హెయిర్‌ సీరమ్‌ రాస్తుంటాం. కానీ రసాయనాల భయం. పైగా రాసిన రోజు బాగానే ఉంటుంది. తర్వాతే జుట్టు ఎండిపోయినట్లుగా తయారవడం, చివర్లు చిట్లడం. ఈసారి నుంచి ఇలా సహజమైనది తయారు చేసుకొని ప్రయత్నించండి.

Published : 23 Jun 2022 02:11 IST

త్వరగా చిక్కులు పోవడానికీ, జుట్టు పట్టుకుచ్చులా మెరవడానికీ హెయిర్‌ సీరమ్‌ రాస్తుంటాం. కానీ రసాయనాల భయం. పైగా రాసిన రోజు బాగానే ఉంటుంది. తర్వాతే జుట్టు ఎండిపోయినట్లుగా తయారవడం, చివర్లు చిట్లడం. ఈసారి నుంచి ఇలా సహజమైనది తయారు చేసుకొని ప్రయత్నించండి.

* 100 మిలీ. అవిసె గింజల నూనెకు రెండు టేబుల్‌ స్పూన్ల చొప్పున అవకాడో నూనె, ఆముదం కలపాలి. ఆపై నచ్చిన ఎసెన్షియల్‌ ఆయిల్‌ను అరస్పూను కలిపితే సరి. డ్రై హెయిర్‌ ఉన్నవారు పెప్పర్‌మింట్‌నీ, నార్మల్‌ వాళ్లు లావెండర్‌ లేదా రోజ్‌, త్వరగా జిడ్డు అవుతుందనుకునే వాళ్లు నిమ్మ లేదా చామంతి ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ను ఎంచుకోవచ్చు.

* ఈ నూనెల మిశ్రమాన్ని చిన్న స్ప్రే బాటిల్‌లో నిల్వ చేసుకోవాలి. తలస్నానం చేసిన తలకు కురుల నుంచి నీరు కారడం ఆగాక దీన్ని స్ప్రే చేసుకుంటే సరి. అయితే వాడే ముందు బాగా షేక్‌ చేయడం తప్పనిసరి. అవసరం తీరాక ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుంటే చాలు.

* అవకాడో నూనెలో ఎ, బి1, బి2, బి5, డి, ఇ విటమిన్లు, మినరల్స్‌, ప్రొటీన్‌, ఫ్యాటీ ఆసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కురులకు కావాల్సిన తేమను అందిస్తాయి.

* ఆముదంలో ఫ్యాటీ ఆసిడ్‌లు ఎక్కువ. వెంట్రుకలు మెరిసేలా చేయడమే కాదు.. మాడుకీ కావాల్సిన తేమని అందిస్తాయి. ఈ నూనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలెక్కువ. చుండ్రును దూరంగా ఉంచుతుంది. కుదుళ్లను ఆర్యోగంగా ఉంచి, వెంట్రుకలు మెరిసేలా చేస్తుంది.

* అవిసె నూనెలో ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్‌లు పుష్కలం. వెంట్రుకల పెరుగుదలలో సాయపడతాయివి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్