అదిరేటి టాపు మీరేస్తే..

నేటి తరంలో జీన్స్‌ చూసి మనసు పారేసుకోని అమ్మాయిలుండరు.. ఇది అంతలా నచ్చేస్తుంది మరి. స్కిన్నీ జీన్స్‌, క్రాప్‌జీన్స్‌, సిగరెట్‌ జీన్స్‌, వైడ్‌లెగ్‌ ఇలా ఎన్ని రకాలో.. అలాగే మిడీస్‌, జెగ్గింగ్స్‌, లెగ్గింగ్స్‌ వీటిలో ఏవి ఎంత ఖరీదుపెట్టి కొన్నా కానీ వాటికి సరైన టాపు ఉండాల్సిందే.

Published : 17 Apr 2023 00:24 IST

నేటి తరంలో జీన్స్‌ చూసి మనసు పారేసుకోని అమ్మాయిలుండరు.. ఇది అంతలా నచ్చేస్తుంది మరి. స్కిన్నీ జీన్స్‌, క్రాప్‌జీన్స్‌, సిగరెట్‌ జీన్స్‌, వైడ్‌లెగ్‌ ఇలా ఎన్ని రకాలో.. అలాగే మిడీస్‌, జెగ్గింగ్స్‌, లెగ్గింగ్స్‌ వీటిలో ఏవి ఎంత ఖరీదుపెట్టి కొన్నా కానీ వాటికి సరైన టాపు ఉండాల్సిందే. మరి టాపుల ఎంపికపై కొంత జాగ్రత్త తీసుకోండి..

కాటన్‌తో.. వేసవి కాలం కాబట్టి శరీరానికి హాయి కలిగించే కాటన్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. దీంట్లో లాంగ్‌, షార్ట్‌ కుర్తీలు మీ ఎత్తుని బట్టి, జీన్స్‌ రంగును బట్టి ఎంపిక చేసుకోవచ్చు. ప్యాంటు తేలిక రంగు అయితే టాపు నిండు రంగు ఉండేలా చూసుకోండి. కాంట్రాస్ట్‌ రంగుల టాపులైతే కాంబినేషన్‌ చాలా బాగుంటుంది.

జార్జెట్‌.. తక్కువ బరువుతో మృదువుగా ఉంటుంది ఈ జార్జెట్‌. దీంట్లో కొత్తగా ఫ్లవర్‌ ప్రింట్‌లు వస్తున్నాయి. నిండు రంగులతో నూతన సొబగులద్దుకొని చాలా చక్కగా ఉంటున్నాయి. వీటిల్లో బెల్‌హ్యాండ్స్‌, నిండు చేతులు, స్లీవ్‌లెస్‌ ఏవైనా బాగుంటాయి. ఇవి మిడీస్‌కు బాగా నప్పుతాయి. మీ ఆహార్యాన్ని బట్టి ఎంచుకోవచ్చు.

టీషర్ట్‌.. హాయిగా శరీరానికి అతుక్కుపోయే టీషర్ట్‌లవైపే అమ్మాయిలు ఎక్కువగా మొగ్గు చూపుతారు. వీటిలోనూ చాలా రకాల మోడల్స్‌ వస్తున్నాయి. చేతులపై పూల ప్రింట్‌లు, వీనెక్‌లు, స్లీవ్‌లెస్‌లూ మీ శరీర తత్వానికీ, రంగుకీ నప్పేలా ఎంచుకుంటే సరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్