ఒత్తైన జుట్టుకి సహజ తైలాలు!

ఒత్తైన జుట్టుకోసం చేయని ప్రయత్నం ఉండదు. ఇందుకు ఖరీదైన ఉత్పత్తులే వాడాలనుకోవద్దు. ఈ నూనెలతో తగిన పోషణ అందించి చూడండి. మార్పు కనిపిస్తుంది.

Published : 11 Aug 2023 00:08 IST

ఒత్తైన జుట్టుకోసం చేయని ప్రయత్నం ఉండదు. ఇందుకు ఖరీదైన ఉత్పత్తులే వాడాలనుకోవద్దు. ఈ నూనెలతో తగిన పోషణ అందించి చూడండి. మార్పు కనిపిస్తుంది.

  • ఉసిరి నూనె: కప్పు ఉసిరిపొడి, గుప్పెడు గులాబీ రేకలు, కప్పు మెంతుల్ని లీటరు నీటిలో వేసి మరిగించండి. ఇది సగం అయ్యేవరకూ ఉంచి దింపేయాలి. ఆపై చల్లారాక సీసాలో భద్రపరుచుకోవాలి. దీన్ని జుట్టుకి పట్టించి మర్దనా చేసి ఓ అరగంటాగి తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే ఉసిరి, గులాబీలోని సి, ఎ విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, మెంతుల్లోని ఖనిజాలు, ఫ్లేవనాయిడ్లు కురులను ఆరోగ్యంగా ఉంచుతాయి.
  • నువ్వుల నూనె: జుట్టుకి పోషణ అందించడంలో నువ్వుల నూనెను మించింది  లేదు. ముఖ్యంగా వీటిల్లోని విటమిన్‌ బి1, క్యాల్షియం, కాపర్‌, ఫాస్ఫరస్‌, ఐరన్‌, మెగ్నీషియం, మాంగనీస్‌, జింక్‌ వంటివి జుట్టుని ఒత్తుగా ఎదిగేలా చేస్తాయి. ముఖ్యంగా ఫ్యాటీ యాసిడ్లు జుట్టు పొడిబారడాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతాయి. చుండ్రుని నివారిస్తాయి. కుదుళ్లు బలంగా ఎదిగేలా చేస్తాయి. దీన్ని నేరుగా తలకు పెట్టుకోవచ్చు. లేదా మరిగించిన కొబ్బరినూనెలో కలిపి కూడా వాడుకోవచ్చు.
  • ఆముదం: వెంట్రుకలు బలహీనంగా ఉన్నప్పుడు, పొడిబారి చిట్లుతున్నప్పుడు ఇది ఔషధంలా పనిచేస్తుంది. సమాన పరిమాణంలో ఆముదం, కొబ్బరినూనెల్ని తీసుకుని అందులో రెండు చెంచాల చొప్పున అవిసెగింజలు, మెంతులు, గుప్పెడు గులాబీ రేకలు వేసి మరిగించాలి. దీన్ని చల్లారాక వడకట్టి గాజు సీసాలోకి తీసుకోవాలి. దీన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకూ రాసి గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికోసారి చేస్తే చాలు...శిరోజాలు నిగనిగలాడతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్