హార్మోన్ల పనితీరు మెరుగవ్వాలంటే...

నెలసరి క్రమం తప్పడం, అలసట, అధికబరువు, ముఖంపై  మొటిమలు, అవాంఛిత రోమాలు... ఇలా చెబుతూపోతే హార్మోన్ల  అసమతుల్యతకు సూచికలు చాలానే కనిపిస్తాయి. అయితే వీటిని సహజంగా సమన్వయం చేయాలంటే...

Updated : 22 Nov 2022 16:02 IST

నెలసరి క్రమం తప్పడం, అలసట, అధికబరువు, ముఖంపై  మొటిమలు, అవాంఛిత రోమాలు... ఇలా చెబుతూపోతే హార్మోన్ల  అసమతుల్యతకు సూచికలు చాలానే కనిపిస్తాయి. అయితే వీటిని సహజంగా సమన్వయం చేయాలంటే... పిండిపదార్థాలు, మాంసకృత్తులు, మంచి కొవ్వులు కలగలిసిన పోషకాహారాన్ని తీసుకోవాలి. అదేంటంటే..
* హార్మోన్ల పనితీరు సక్రమంగా ఉండాలంటే... సరైన పరిమాణంలో  ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి అందాలి. రోజూ చెంచా చొప్పున ఇంట్లో తయారుచేసిన వెన్న/నెయ్యిని తీసుకోండి. ఇందులోని ఎ, డి, ఇ, కె2   విటమిన్లు, మొక్కల ఆధారిత కొవ్వులుండే అవకాడో, ఆలివ్‌ నూనెల్నీ భాగం చేసుకోవాలి. కనీసం రోజూ రెండు తెల్లసొనలను తినాలి. నాలుగైదు వాల్‌నట్స్‌ తీసుకోవాలి. వీటిల్లోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు సహజంగా హార్మోన్ల పనితీరుని మెరుగుపరుస్తాయి. చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.  
* గుమ్మడి, అవిసె, పొద్దుతిరుగుడు గింజలతోపాటు నువ్వులను రోజూ తినడం వల్ల హార్మోన్ల పనితీరు మెరుగ్గా ఉంటుంది. అలానే మీ ఆహారంలో సప్తవర్ణాలు కనిపించేలా అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు చేర్చుకోండి. అప్పుడే మీ బరువు అదుపులోకి వస్తుంది. పోషకాల లేమిని అధిగమించొచ్చు.
* హార్మోన్ల మెటబాలిజానికి కాలేయానిదే ప్రధాన పాత్ర. రోజూ గ్రీన్‌ టీ తాగడం వల్ల ఇది డీటాక్స్‌ అవుతుంది. ఒత్తిడి అదుపులో ఉంటుంది. ఇక జీర్ణవ్యవస్థ పనితీరూ హార్మోన్ల సమన్వయానికి కీలకమే. అందుకు మేలుచేసే బ్యాక్టీరియా మోతాదు ఒంట్లో పెరగాలి. దీనికోసం తప్పనిసరిగా పెరుగు, మజ్జిగ, ఇడ్లీ, దోశ తీసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్