దృఢత్వాన్ని పెంచే తాడు!

కరోనా వల్ల జిమ్‌కి వెళ్లాలన్నా, కాసేపు వాకింగ్‌కి వెళ్దామన్నా భయమే. ఇలాంటప్పుడు ఇంట్లోనే ఉండి సులువుగా చేయగలిగే వ్యాయామాల్లో తాడాట ఒకటి.

Published : 03 Jul 2021 01:02 IST

కరోనా వల్ల జిమ్‌కి వెళ్లాలన్నా, కాసేపు వాకింగ్‌కి వెళ్దామన్నా భయమే. ఇలాంటప్పుడు ఇంట్లోనే ఉండి సులువుగా చేయగలిగే వ్యాయామాల్లో తాడాట ఒకటి.
రోజూ ఏదో ఒక సమయంలో తాడాట కనీసం రెండు మూడు నిమిషాలు ఆడండి. ఆపై క్రమంగా ఐదు నిమిషాలైనా కేటాయించుకునేలా చూడండి. ఇది గుండెకు రక్తప్రసరణ, ప్రాణవాయువు సరిగ్గా అందేలా చూసి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఊపిరి తీసుకునే సామర్థ్యమూ పెరుగుతుంది.
* కాళ్లకూ, శరీరం కింది భాగానికి తగిన వ్యాయామం అందాలంటే చక్కని మార్గం తాడాటే. మొదట్లో శరీరం సహకరించకపోవచ్చు. మీ బరువుని మీరే అదుపు చేసుకోలేమనిపించొచ్చు. అయినా వెనకడుగు వేయొద్దు. ఇలా ఆడితే కాళ్ల కదలిక చురుగ్గా ఉంటుంది. కండరాలకు చక్కని మర్దన అందుతుంది. ఇది మెదడుకీ, శరీరానికి మధ్య సమన్వయాన్ని పెంపొందిస్తూ, ఏకాగ్రతనూ పెంచుతుంది.
* బరువు తగ్గాలని చాలా ప్రయత్నాలే చేస్తున్నా.. త్వరగా ప్రయోజనం అందాలంటే ఎంచుకోవలసిన వ్యాయామం ఇది. రోజూ అరగంట ఈ వ్యాయామం చేస్తే చాలు.. దాదాపు మూడు వందల కెలొరీలు కరుగుతాయి. శరీరంలో పేరుకునే కొవ్వు కూడా తగ్గుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్