బార్లీ భలే పోషకం

ఇంటా బయటా మహిళలు పనితో శారీరకంగా అలసి పోవడమే కాదు, మానసిక ఒత్తిడికీ గురవుతుంటారు. ఈ అలసట, ఆందోళనలతో అనారోగ్యాలు దాడి చేస్తుంటాయి. అలాంటి సమస్యలకు బార్లీతో చెక్‌ పెట్టొచ్చు.

Published : 25 Aug 2021 01:36 IST

ఇంటా బయటా మహిళలు పనితో శారీరకంగా అలసి పోవడమే కాదు, మానసిక ఒత్తిడికీ గురవుతుంటారు. ఈ అలసట, ఆందోళనలతో అనారోగ్యాలు దాడి చేస్తుంటాయి. అలాంటి సమస్యలకు బార్లీతో చెక్‌ పెట్టొచ్చు.
* శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు బార్లీలో పుష్కలంగా దొరుకుతాయి.
* ఉడికించిన బార్లీ గింజల్లో కొంచెం నిమ్మరసం, దానిమ్మ గింజలు, నానబెట్టిన పెసలు కలిపి తింటే ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌ అవుతుంది. క్రమం తప్పకుండా బార్లీని ఆహారంలో భాగం చేసుకుంటే చర్మం కాంతిమంతంగానూ మారుతుంది.
* బార్లీ గింజల్లో దొరికే క్యాల్షియం, కాపర్‌, మెగ్నీషియం, జింక్‌ వంటి ఖనిజాలు ఎముకలను దృఢంగా ఉంచుతాయి. పీచు ఎక్కువగా ఉండటంవల్ల ఆహారం తేలిగ్గానూ అరుగుతుంది.
* బార్లీ జావ ఆకలిని పెంచుతుంది. ఊబకాయాన్ని తగ్గిస్తుంది. మధుమేహం, హృద్రోగాలు, కొన్ని రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. మరీ ముఖ్యంగా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా కాపాడుతుంది. ఇందులో ఉన్న బీటా గ్లూకాన్స్‌ కొలెస్ట్రాల్‌ స్థాయిని నియంత్రిస్తాయి.
* అరకప్పు బార్లీ గింజలను ఆరు కప్పుల నీళ్లతో ఉడికించి వడకట్టి తాగితే కిడ్నీ సమస్యలే కాదు, ఇతర అనారోగ్యాలూ తలెత్తవు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్