హార్మోన్ల సమతుల్యత కోసం

మహిళల్లో ఒత్తిడి స్థాయులు, నిద్ర, మానసిక స్థితి వంటివన్నీ హార్మోన్ల పనితీరుపై ఆధారపడి ఉంటాయి. అలాంటి హార్మోన్లను పుట్టగొడుగులు సమతుల్యం చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

Updated : 15 Apr 2024 12:20 IST

మహిళల్లో ఒత్తిడి స్థాయులు, నిద్ర, మానసిక స్థితి వంటివన్నీ హార్మోన్ల పనితీరుపై ఆధారపడి ఉంటాయి. అలాంటి హార్మోన్లను పుట్టగొడుగులు సమతుల్యం చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అవెలా ఉపయోగపడతాయో చూడండి...

వ్యాధినిరోధక శక్తి... పుట్ట గొడుగులను రోజూ తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో మలినాలను బయటకు పంపడంతో పాటు జీర్ణశక్తిని పెంచి చర్మాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

ఈస్ట్రోజెన్‌... మహిళలకు అత్యవసరమైన హార్మోన్లను సమన్వయం చేయడంలో పుట్టగొడుగులు ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ఉత్పత్తిలో సాయపడతాయి. ఇది మెనోపాజ్‌ దశలో మహిళలకు హృద్రోగం వంటి అనారోగ్యాలు రాకుండా పరిరక్షిస్తాయి. అలాగే క్రమం తప్పే నెలసరిని సరిచేస్తాయి. అధిక రక్తస్రావం, పెల్విక్‌ భాగంలో వచ్చే నొప్పిని తగ్గిస్తాయి. ఆ సమయంలో వచ్చే చికాకు, మూడ్‌ స్వింగ్స్‌, ఆందోళన, ఒత్తిడి వంటివాటిని దరి చేరనివ్వవు. హార్మోన్ల లోపం వల్ల వచ్చే పాలిసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌ (పీసీఓఎస్‌)తో ఎదురయ్యే అవాంఛిత రోమాలు, చర్మంపై వచ్చే నల్లని మచ్చలు, మొటిమలు వంటి సమస్యలను నిరోధిస్తాయి. అంతేకాదు, ఎండోమెట్రియాసిస్‌ సమస్యతో గర్భాశయంలో వచ్చే పలురకాల అనారోగ్యాలనూ తగ్గిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్