పెద్దల ఆరోగ్యం పదిలంగా...

ఇంట్లో అత్తామామలు, తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని పరిరక్షించే బాధ్యత చాలావరకు ఆ ఇంటి ఇల్లాలిపైనే ఉంటుంది. నిండు నూరేళ్లు పెద్దవాళ్లు ఆరోగ్యంగా ఉంటే అది ఆ కుటుంబ సంతోషంపై మంచి ప్రభావాన్ని చూపిస్తుందంటారు నిపుణులు. వృద్ధుల శారీరక, మానసిక ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను కొన్నింటిని సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.

Published : 28 Sep 2021 00:51 IST

ఇంట్లో అత్తామామలు, తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని పరిరక్షించే బాధ్యత చాలావరకు ఆ ఇంటి ఇల్లాలిపైనే ఉంటుంది. నిండు నూరేళ్లు పెద్దవాళ్లు ఆరోగ్యంగా ఉంటే అది ఆ కుటుంబ సంతోషంపై మంచి ప్రభావాన్ని చూపిస్తుందంటారు నిపుణులు. వృద్ధుల శారీరక, మానసిక ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను కొన్నింటిని సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.

పౌష్టికాహారం :  60-65 మధ్య వయసున్నవారికి కొలెస్ట్రాల్‌ తక్కువగా ఉండే ఆహారాన్ని అందించాలి. ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు కావాల్సినంత మాత్రమే ఉండేలా జాగ్రత్తపడాలి. మధుమేహం, రక్తపోటు సమస్యలుంటే చక్కెర, ఉప్పులేకుండా చూడాలి. ఎముకలు, కండరాలు బలహీనపడకుండా ఆహారం ద్వారా కాల్షియం అందేలా చూస్తే చాలు. అలాగే రోజూ కనీసం పావుగంట నుంచి ఇరవై నిమిషాలు నడిచేలా చేస్తే నిద్రలేమి సమస్య దరిచేరదు.  ఇవన్నీ హృద్రోగం, మధుమేహం వంటి సమస్యలను దరిచేరనివ్వవు. రోజులో ఆరేడు గ్లాసుల నీటిని తాగించాలి. పీచు ఎక్కువగా ఉండే కూరగాయలను వంటలో చేరిస్తే, అవి వారి జీర్ణశక్తిని మెరుగుపరిచి, ఆహారాన్ని తేలికగా జీర్ణమయ్యేలా తోడ్పడతాయి. అలాగే ఆరునెలలకొకసారి రక్తపోటు, మధుమేహం పరీక్షలు చేయించాలి. ఏడాదికొకసారైనా నేత్ర, దంతవైద్యుల వద్దకు తీసుకెళ్లాలి.

మానసికంగా : శారీరకంగానే కాకుండా వృద్ధులు మానసికంగానూ సంతోషంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు. వారికి మీ తోడు అవసరం. అభద్రత దరి చేరకూడదంటే వారిని ఒంటరిగా వదిలేయకూడదు. వారి భావోద్వేగాలను, సమస్యలను తెలుసుకోండి. గత అనుభవాలను చెప్పమనండి. ఇవన్నీ వారిలో ఉత్సాహం పెంచేవే. పిల్లలను వారికి దగ్గరగా ఉండేలా ప్రోత్సహించాలి. పుస్తకపఠనం, తోటపని వంటివన్నీ కలిసి చేసేలా చిన్నారులకు అలవరిస్తే వృద్ధులు ఒంటరిగా భావించరు. అప్పుడే వారు మానసికంగా ఆరోగ్యంగా ఉండగలరు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్