నెలసరి బాధకు జామ!

అన్ని కాలాల్లోనూ చవకగా దొరికే పోషకాల పండు జామ. నెలసరి సమస్యలకు, గర్భిణులకు జామ చేసే మేలెంతో... మరిన్ని ప్రయోజనాలు తెలుసుకుందామా!

Published : 01 Nov 2021 21:30 IST

అన్ని కాలాల్లోనూ చవకగా దొరికే పోషకాల పండు జామ. నెలసరి సమస్యలకు, గర్భిణులకు జామ చేసే మేలెంతో... మరిన్ని ప్రయోజనాలు తెలుసుకుందామా!

🍏 ఈ పండు, ఆకుల్లో... విటమిన్‌ సి, లైకోపిన్, యాంటీ ఆక్సిడెంట్లు విరివిగా లభిస్తాయి. ఇవి క్యాన్సర్‌ కణాల వృద్ధిని అడ్డుకుంటాయి. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండేవారు రోజూ ఓ పండు తింటే ఎంతో మేలు.

🍏 జామకు ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ గుణం ఉంది. రక్తంలో చక్కెర స్థాయుల్నీ సమన్వయం చేసే శక్తి ఎక్కువ. అందుకే వీలైతే వీటి ఆకుల్నీ తినండి.

🍏 నెలసరి సమయంలో చాలామంది మహిళలు డిస్మెనోరియాతో బాధ పడుతుంటారు. వీరు జామ ఆకులు, పండ్లను తరచూ తింటుంటే... సమస్య దూరమవుతుంది. వీటిలోని మెగ్నీషియం ఇతర పోషకాలను శరీరం సరిగా స్వీకరించేలా సాయ పడుతుంది. పీచు జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. సోడియం, పోటాషియం నిల్వలు.. రక్తపోటుని అదుపులో ఉంచుతాయి.

🍏 జామలో ఉండే విటమిన్‌ ఎ కంటి చూపుని మెరుగుపరుస్తుంది. క్యాటరాక్ట్‌ సమస్య రాకుండా అదుపు చేస్తుంది. ఇందులో గర్భిణులకు మేలు చేసే ఫోలిక్‌ యాసిడ్‌ కూడా ఎక్కువే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్