సమయానికి రావడం లేదా!

మారుతున్న జీవనశైలి వల్ల మహిళల్లో ఒత్తిడి ఎక్కువై నెలసరి సమయానికి రాకపోవడం, లేదా కొద్దిమొత్తంలో కనిపించి ఆగిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇది మెనోపాజ్‌కూ దారి తీయొచ్చంటున్నారు నిపుణులు..

Updated : 16 Nov 2021 05:27 IST

మారుతున్న జీవనశైలి వల్ల మహిళల్లో ఒత్తిడి ఎక్కువై నెలసరి సమయానికి రాకపోవడం, లేదా కొద్దిమొత్తంలో కనిపించి ఆగిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇది మెనోపాజ్‌కూ దారి తీయొచ్చంటున్నారు నిపుణులు..

బరువు పెరిగితే: ఆకస్మికంగా బరువు పెరగడం, తగ్గడం రుతు చక్రాన్ని ప్రభావితం చేస్తుంది. హార్మోన్లు అసమతౌల్యానికి గురవుతాయి. వయసు పెరగడం వల్ల కూడా రక్తస్రావం చాలావరకు తగ్గిపోతుంది.

అధిక వ్యాయామాలు: కష్టమైన లేదా ఎక్కువగా వ్యాయామాలు చేయడం వల్ల ఈ సమస్య రావొచ్చు.

త్వరగా మెనోపాజ్‌: ఒత్తిడి ఎక్కువైతే మెదడు రుతుచక్రానికి కారణమయ్యే హార్మోన్లను మార్చేస్తుంది. ఫలితంగా నెలసరి సాఫీగా రాదు. ఇది దీర్ఘకాలం కొనసాగినా మెనోపాజ్‌ త్వరగా వచ్చే ప్రమాదముంది. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవాలి.

మాత్రలు: గర్భనిరోక మాత్రలవల్లా పీరియడ్స్‌ ఆలస్యమవ్వొచ్చు. ఇవి అండాలను తయారు చేయడాన్ని అడ్డుకుంటాయి.

నిద్రలేమి: తగినంత నిద్రపోకపోతే స్ట్రెస్‌ను తగ్గించే కార్టిసోల్‌ హార్మోన్‌ సరిగా ఉత్పత్తి కాదు. ఫలితంగా ఇర్రెగ్యులర్‌ పీరియడ్స్‌, తక్కువ రక్తస్రావం. పాలిచ్చే తల్లులు, రక్తహీనత, తదితర అనారోగ్యాలున్న వారిలోనూ ఈ సమస్య ఎదురవుతుంది.

ఎదుర్కోవడమెలా... ఐరన్‌, విటమిన్లు అధికంగా ఉండే క్యారెట్‌ జ్యూస్‌ను తాగాలి. ఇది రక్తహీనతనూ తగ్గిస్తుంది.

మరిగే నీటిలో కాసింత దాల్చినచెక్క పొడిని కలిపి తాగితే సరి. రోజూ 200 గ్రాముల బొప్పాయి తింటే రక్తవృద్ధి జరుగుతుంది. పీరియడ్స్‌ సక్రమంగా వస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్