నీళ్లెంతో అవసరం..

వాతావరణం చల్లగా ఉండటంతో నీళ్లు తాగడానికి చాలామంది ఇష్టపడరు. ఇలాంటప్పుడు కనీసం తీసుకునే ఆహారంలో అయినా అవి ఎక్కువగా ఉండేలా చూసుకుంటే మంచిది.సొర - బీర: ఇవి శరీరంలో నీటి నిల్వలు కోల్పోకుండా చేస్తాయి.

Updated : 26 Nov 2021 05:32 IST

వాతావరణం చల్లగా ఉండటంతో నీళ్లు తాగడానికి చాలామంది ఇష్టపడరు. ఇలాంటప్పుడు కనీసం తీసుకునే ఆహారంలో అయినా అవి ఎక్కువగా ఉండేలా చూసుకుంటే మంచిది.

సొర - బీర: ఇవి శరీరంలో నీటి నిల్వలు కోల్పోకుండా చేస్తాయి. అందుకే జ్వరంతో  ఉన్న వారికి, గర్భిణులకు వీటిని ఎక్కువగా ఇస్తారు. వీటిల్లో ఉండే పీచు జీర్ణ వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది. బీరలో సి విటమిన్‌, జింక్‌, థయామిన్‌ వంటి పోషకాలు ఉంటాయి.

కీర.. నీటి శాతం ఎక్కువగా ఉండే కీరదోసను ఏ కాలంలో అయినా ఎక్కువగా తినడం మంచిదే. ఇది శరీరంలోని వేడిని బయటకు పంపేస్తుంది.

ముల్లంగి.. విటమిన్‌ సి, నీటి శాతం అధికంగా ఉన్న ముల్లంగిని తింటే వేడి తగ్గుతుంది. టమోటా, క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌, క్యాప్సికమ్‌, స్ట్రాబెర్రీలలో కూడా నీరు ఎక్కువ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్