మెనోపాజ్‌తో మతిమరుపా?

ప్రతీది మర్చిపోవడం, అయోమయం, దేనిమీదా దృష్టి పెట్టలేకపోవడం, దిగులుతో ఇబ్బంది పడటం... ఈ పరిస్థితినే ‘బ్రెయిన్‌ఫాగ్‌’ అంటారు. స్త్రీలలో మెనోపాజ్‌ సమయంలో ఎక్కువగా ఎదురయ్యే ఈ సమస్య

Updated : 09 Jan 2022 00:32 IST

ప్రతీది మర్చిపోవడం, అయోమయం, దేనిమీదా దృష్టి పెట్టలేకపోవడం, దిగులుతో ఇబ్బంది పడటం... ఈ పరిస్థితినే ‘బ్రెయిన్‌ఫాగ్‌’ అంటారు. స్త్రీలలో మెనోపాజ్‌ సమయంలో ఎక్కువగా ఎదురయ్యే ఈ సమస్య కెరియర్‌కీ సవాల్‌గా మారుతుందంటోంది మెల్‌బోర్న్‌లోని మెనాస్‌ విశ్వవిద్యాలయ అధ్యయనం. ఇందులో ఇంకా అనేక ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. నెలసరులు పూర్తిగా ఆగిపోయిన దశలో దాదాపు సగం మంది జ్ఞాపకశక్తి సమస్యలతో బాధపడుతున్నారట. చాలామందికి ఎదుటివ్యక్తి పేరు కూడా చప్పున స్ఫురణకు రాక సతమతమవుతూంటారట. ఈ సమస్యలు పని వాతావరణంలో ఉత్పాదకతని దెబ్బతీయడంతోపాటు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తాయట. అండాశయాలు విడుదల చేసే ఒక రకం హార్మోన్‌ విడుదల ఆగిపోయి అది మెదడుపై ప్రభావం చూపించడమే ఈ పరిస్థితికి కారణం అంటున్నారు అధ్యయనవేత్తలు. దీన్నుంచి ఉపశమనానికి... ముందు నుంచే రోజూ ధ్యానం చేయడం, అనవసర మందుల వాడకాన్ని తగ్గించుకోవడం మార్గాలని సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్