డైటింగా.. ఆగండి

లావు అయ్యావు, ఒళ్లు చేశావు.. ఈ మాటల్ని అమ్మాయిలతో అని చూడండి. వెంటనే డైటింగ్‌ అంటూ మొదలెట్టేస్తారు. కొన్నిసార్లు పీసీఓడీ వంటి వల్లా చేస్తుంటారు. కారణమేదైనా ప్రారంభించే ముందు ఈ ప్రశ్నలు వేసుకున్నారా మరి?

Updated : 29 Feb 2024 17:11 IST

లావు అయ్యావు, ఒళ్లు చేశావు.. ఈ మాటల్ని అమ్మాయిలతో అని చూడండి. వెంటనే డైటింగ్‌ అంటూ మొదలెట్టేస్తారు. కొన్నిసార్లు పీసీఓడీ వంటి వల్లా చేస్తుంటారు. కారణమేదైనా ప్రారంభించే ముందు ఈ ప్రశ్నలు వేసుకున్నారా మరి?

* ఎందుకు?.. ఫిట్‌నెస్‌ లేదా అనారోగ్యం వీటిల్లో దేని కారణంగా తగ్గాలనుకుంటున్నారో స్పష్టత ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉంటే అది లావనిపించుకోదు. కేవలం ఎవరో అన్నారనో, మీకనిపించిందనో నిర్ణయం తీసుకోకండి. ముందు చెక్‌ చేసుకుంటే.. తర్వాత ఏం చేయాలన్న దానిపై స్పష్టత వస్తుంది.

* తగిన సమయమేనా?.. ప్రస్తుత పరిస్థితినే తీసుకోండి. ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నాయి. అందరూ రోగనిరోధకశక్తిని ఇచ్చే ఆహారంపై దృష్టిపెడుతున్నారు. ఈ సమయంలో ఫలానావే తింటానని కూర్చుంటే సమస్య కదా! ఇంట్లో నుంచే పనంటే జీవనశైలిలోనూ మార్పులు వచ్చుండొచ్చు. కాబట్టి ఒకేసారి పూర్తిగా కాకుండా కొద్దికొద్దిగా మార్పులు చేసుకుంటూ వెళితే మంచిది.

* సరిపడుతుందా?.. కాలేజ్‌/ ఆఫీసు పనితో తలమునకలై ఉన్నారు. ఈ సమయంలో కొద్ది మొత్తంలో తింటే ఒంటికి సరిపోతుందా? లేదు కదా! పైగా కేవలం డైట్‌తో తగ్గరు. వ్యాయామమూ చేయాలి. ఇన్నింటికి శక్తి కావాలంటే.. సరిగా తినాల్సిందే. ఇలాంటప్పుడు డైటింగ్‌ సరిపడదు. ఇంటికి దూరంగా ఉండేవాళ్లు అన్నిసార్లూ వండుకోలేరు. అప్పుడు బయటి తిండే గతి. అలాంటప్పుడూ కుదరదు. వీటినీ చూసుకోవాలి.

* అదనపు లాభముందా?.. బరువు తగ్గడం అన్నిసార్లూ ఆరోగ్యకరం కాకపోవచ్చు. మీరు పాటించే విధానం అనారోగ్యకరంగా లేకుండా చూసుకోండి. లేదంటే భవిష్యత్తులో సమస్యలెదురవొచ్చు. దాంతోపాటు మీ బడ్జెట్‌లోనే ఉందా లేదా కూడా చూసుకోండి. అలాగే కొన్ని విధానాలు ఒంటికి సరిపడకపోవచ్చు. కాబట్టి, నిపుణుల సలహా తీసుకున్నాకే ఆహారంలో ఏ మార్పులైనా చేసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్