పనివేళలు.. భిన్నమైతే!

ఇప్పుడు చాలావరకూ ఇంటి నుంచే పని! సమయానికి మించి చేసేవారే ఎక్కువ. ఈ తీరు ఆరోగ్యంపై దుష్ప్రభావాన్ని చూపుతుంది. ఈ చిన్ని మార్పులను చేసుకుని చూడండి.

Updated : 26 Jan 2022 05:29 IST

ఇప్పుడు చాలావరకూ ఇంటి నుంచే పని! సమయానికి మించి చేసేవారే ఎక్కువ. ఈ తీరు ఆరోగ్యంపై దుష్ప్రభావాన్ని చూపుతుంది. ఈ చిన్ని మార్పులను చేసుకుని చూడండి.

* రాత్రుళ్లు ఆలస్యంగా పడుకునేవారు సహజంగానే ఆలస్యంగా లేస్తారు. అల్పాహారాన్ని మానేసేవారే ఎక్కువ. ఇది మధుమేహానికి దారితీయొచ్చు. వీలైతే ఉదయాన్నే లేసి ఏదైనా తిని తర్వాత పడుకోవడం మేలు.
* అర్ధరాత్రుల వరకూ లేచి ఉండేవారిలో గుండె సంబధ వ్యాధులకు అవకాశాలెక్కువ. తెల్లవారాక వచ్చే వెలుగు మెదడును పూర్తి విశ్రాంతిని తీసుకోనివ్వదట. అది శరీరంపై ఒత్తిడిని కలుగజేస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి, లేచాక కొద్ది సమయాన్ని తప్పక వ్యాయామానికి కేటాయించండి. ముఖ్యంగా ప్రకృతిలో కొంత సమయం గడపడానికి ప్రయత్నించండి. కేవలం నడిచినా సరే.. కానీ కొద్దిసేపైనా బయటి వాతావరణంలో తిరగడం తప్పనిసరి.
* ఆలస్యంగా పడుకున్నా సరే.. కానీ ఒకే సమయానికి పడుకోవడం అలవాటు చేసుకోండి. రోజుకో సమయంలో పడుకోవడమూ మెదడుపై ప్రభావం చూపేదే! వారాంతాలు, సెలవుల్లోనూ ఇదే పద్ధతిని పాటించాలి. పొద్దుపోయేవరకూ లేచి ఉండటం, ఒత్తిడి తెలియకుండానే ఆకలికి కారణమవుతుంది. దీంతో దొరికిందల్లా తినేస్తుంటారు. ఇది రక్తంలో చక్కెర స్థాయులు పెరగడానికి కారణమవుతుంది. రాత్రుళ్లు అతిగా తినడం నిద్రలేమికీ కారణమవుతుంది. రాత్రి భోజనానికీ పక్కా సమయాన్ని పాటించాలి. మధ్యలో ఆకలేసినా చిరుతిళ్లను కాకుండా ఏదైనా పండును ఎంచుకోవడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్