రోజంతా.. ఉల్లాసమే!

మనకి నిద్ర లేవడం దగ్గర్నుంచే పని హడావుడి మొదలవుతుంది. క్షణం తీరిక లేకుండా చేసినా.. ఏదో మర్చిపోవడమో, అసంతృప్తో మిగులు తుంటుంది. ఈ చిన్ని అలవాట్లు చేసుకోండి.. ఆ భావన దరిచేరదు. రోజూ ఉల్లాసంగా గడిచిపోతుంది.

Published : 19 Feb 2022 00:53 IST

మనకి నిద్ర లేవడం దగ్గర్నుంచే పని హడావుడి మొదలవుతుంది. క్షణం తీరిక లేకుండా చేసినా.. ఏదో మర్చిపోవడమో, అసంతృప్తో మిగులు తుంటుంది. ఈ చిన్ని అలవాట్లు చేసుకోండి.. ఆ భావన దరిచేరదు. రోజూ ఉల్లాసంగా గడిచిపోతుంది.

* ఉదయం లేవగానే పరగడుపున గోరువెచ్చని నీటిని తాగండి. అప్పటిదాకా స్తబ్దుగా ఉన్న అవయవాలు, కండరాల్లో ఉత్తేజం కలగడానికి ఇది సాయపడుతుందని ఆయుర్వేదం చెబుతోంది. అంతే కాదు మలినాలు బయటకు వెళ్లడంతోపాటు శరీరానికి ఉత్సాహమూ అందుతుంది.
* పని వేచి చూస్తోందని తెలిసినా.. ఓ పది నిమిషాలు ధ్యానం, వ్యాయామాలకు కేటాయించండి. ధ్యానం మానసిక ఆరోగ్యానికి కృషి చేసి ఒత్తిడి, ఆందోళనలను దరిచేరనివ్వదు. సానుకూల ఆలోచనలకూ కారణమవుతుంది. వ్యాయామం శారీరక దారుఢ్యాన్ని ఇవ్వడంతోపాటు మతి మరపునూ దూరంగా ఉంచుతుంది. పెద్దపెద్దవే చేయనక్కర్లేదు. చిన్న చిన్న స్ట్రెచ్‌లు సరిపోతాయి.
* పరిస్థితిని బట్టి ఒకేసారి ఎన్నో పనులు చేయాల్సి వస్తుంది. నిజమే! కానీ ఇది మెదడును తికమక పెడుతుంది. అప్పటిదాకా గుర్తుండి.. ఇంతలోనే మర్చిపోయామనుకుంటామే! ఇదే కారణం. చేసిన పనిపై సంతృప్తి కలగకపోవడానికీ మూలమిదే. ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్లండి. ముఖ్యంగా కష్టమైన వాటిని ముందు, తేలికైన వాటిని చివర్లో చేయండి. దీనికి సంబంధించిన జాబితాను రాత్రే సిద్ధం చేసుకుంటే ఉదయానికి పనీ సులువవుతుంది. మీకు మర్చిపోయే బాధ, దాని వల్ల కలిగే అసంతృప్తీ తప్పుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్