ఇల్లాలికిష్టమైన శనగలు

సాయంత్రం అలా షికారుకి వెళ్తోంటే చాట్‌ బండార్‌ ఘుమఘుమలు ఆకర్షిస్తాయి. మనకు తెలియకుండానే అడుగులు అటు వైపు పడతాయి. పానీపూరీ, ఆలూచోలే, రగడచాట్‌, టిక్కా తయారీలో

Published : 21 Sep 2022 00:21 IST

సాయంత్రం అలా షికారుకి వెళ్తోంటే చాట్‌ బండార్‌ ఘుమఘుమలు ఆకర్షిస్తాయి. మనకు తెలియకుండానే అడుగులు అటు వైపు పడతాయి. పానీపూరీ, ఆలూచోలే, రగడచాట్‌, టిక్కా తయారీలో ప్రధానమైనవి శనగలే. వీటిలో ఎన్నో రకాలున్నా చిన్నగా, పొగాకు రంగులో ఉండే దేశీ, లేత గోధుమ రంగులో కాస్త పెద్దగా ఉండే కాబూలీ రకాలు ముఖ్యమైనవి. ఇంతకీ శనగలు మనమెందుకు తప్పకుండా తీసుకోవాలో, వాటితో శరీరానికి ఎన్ని పోషకాలు అందుతాయో తెలుసా...

* శనగల్లో ప్రొటీన్లు, కాపర్‌, ఐరన్‌, జింక్‌, భాస్వరం, మెగ్నీషియం, థయామిన్‌, పొటాషియం, పిండి పదార్థాలు, విటమిన్లు ఉన్నందున మంచి పోషకాహారం. చారెడు నానబెట్టిన శనగలు తింటే నీరసం, నిస్సత్తువ ఆవరించవు.

* తేలిగ్గా స్నాక్స్‌ చేయొచ్చు కనుక ఇల్లాలికి ఇవి మహా ఇష్టం. కాయ గూరలేవీ లేకుంటే అల్లం, వెల్లుల్లి, మసాలా దట్టించి శనగల కూర చేసుకోవచ్చు. అన్నం, చపాతీ.. ఎందులోకైనా అదుర్సే.

* మాంసాహారం తినని వారికి ఇవి మంచి ప్రత్యామ్నాయం. బరువు పెరగనీయవు, శరీరానికి పటుత్వం లభిస్తుంది.

* గ్లైసెమిక్‌ లక్షణాలు తక్కువగా ఉండటాన శరీరం వీటిని గ్రహించడానికి, జీర్ణమవడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టినా.. గ్లైసెమిక్‌, ఎమిలోజ్‌ల కారణంగా రక్తంలో చెక్కెర, ఇన్సులిన్‌ల స్థాయి వేగంగా పెరగదు. మధుమేహంతో బాధపడుతున్నవారికి మేలైనవి.

* వీటిలో ఉన్న క్యాల్షియం, మెగ్నీషియం, ఇతర పోషకాలు ఎముకలను దృఢంగా ఉంచుతాయి. కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గిస్తాయి. దాంతో హృద్రోగాలు వచ్చే అవకాశం తక్కువ.

* సెలీనియం, కొలిన్‌, జింక్‌ తదితరాల వల్ల మెదడు పనితీరు బాగుంటుంది. సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది.

* పాలిసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌ వంటి జీవప్రక్రియ రుగ్మతలు తగ్గుతాయి. శనగలు పేగుల కదలికలను వేగవంతం చేయడంతో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.

* దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారికి మంచి ఆహారం.

* రుచిగా ఉంటూ, చవకగా దొరికే శనగలతో పంజాబీ చోలే, చనా మసాలా, షామీ కబాబ్‌, చోలే భటూరా, శనగల పులావ్‌, చాట్‌, పాలక్‌ చోలే, కడాలా కర్రీ, ఆలూ చనా కర్రీ లాంటి ఎన్నో రకాల వంటకాలు చేసుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్