మనసు బాలేదా?

శీతకాలమే అంత... మనసుని స్తబ్దుగా చేస్తుంది. ఏ పనికీ మనస్కరించదు. ఏదో ఒకరోజు అలా అనిపించడంలో తప్పు లేదు. మూడ్‌ ఎప్పుడూ బాగోక పోవడం, మనసంతా బాధగా భారంగా అనిపిస్తోందా.. అదీ రోజూ అలాగే ఉంటోంటే మాత్రం జాగ్రత్త.

Updated : 24 Dec 2022 15:10 IST

శీతకాలమే అంత... మనసుని స్తబ్దుగా చేస్తుంది. ఏ పనికీ మనస్కరించదు. ఏదో ఒకరోజు అలా అనిపించడంలో తప్పు లేదు. మూడ్‌ ఎప్పుడూ బాగోక పోవడం, మనసంతా బాధగా భారంగా అనిపిస్తోందా.. అదీ రోజూ అలాగే ఉంటోంటే మాత్రం జాగ్రత్త. ఎందుకంటే మీరు ‘శాడ్‌’ బారిన పడుండొచ్చు. ఏమిటిది? నిపుణుల సలహా ఇదిగో..!

ఏమిటిది?: సీజనల్‌ ఎఫెక్టివ్‌ డిజార్డర్‌ను సంక్షిప్తంగా ‘శాడ్‌’ అంటారు. ఇదెక్కువగా ఈ కాలంలోనే కనిపిస్తుంటుంది. రోజంతా భారంగా, బాధగా అనిపించడం, ఏ పనీ చేయాలని అనిపించకపోవడం, ఒక దానిపై దృష్టి పెట్టలేకపోవడం, అస్తమానూ ఏదో ఒకటి తినాలనిపించడం, అతినిద్ర, ప్రొటీన్‌ పదార్థాలపై ఆసక్తి, ఏమీ  చేయక పోయినా అలసిపోయినట్లుగా అనిపించడం.. వంటివన్నీ దీని సూచనలే! ప్రెగ్నెన్సీలో, నెలసరి ముందు మనకు సాధారణ లక్షణాలే ఇవి. వాటితో సంబంధం లేకుండా తరచూ కనిపిస్తోంటేనే ప్రమాదం.

ఎలా గుర్తుపట్టాలి?: ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారిపోవడం, ఎండ తగిలే అవకాశాలు తగ్గిపోవడం వల్ల రక్తంలో సెరటోనిన్‌ స్థాయిలు పడిపోతాయి. ఫలితమే మనసు బాలేకపోవడం, డిప్రెషన్‌ వంటివి. కొన్నిసార్లు వంశపారంపర్యం కూడా. డి విటమిన్‌ తగ్గడం వల్లా ఇలా జరుగుతుంది. కాలంతో వచ్చేది కాబట్టి, సీజన్‌ మారగానే మామూలై పోతాం అనుకోవద్దు. అదే పొరబాటు. దీన్ని ఇలాగే వదిలేస్తే తీవ్ర పరిణామాలకు దారితీస్తుందట. క్రమంగా సాంఘిక జీవనంపై విరక్తి, నలుగురితో మాట్లాడటానికి అనాసక్తి కలుగుతాయి. దేన్నీ సరిగా చేయలేరు. దీంతో ఆత్మవిశ్వాసం కొరవడుతుంది. ప్రతిదీ ఎక్కువగా ఊహించుకోవడం, చీటికీమాటికీ ఏడుపు, ప్రతికూల ఆలోచనలు కొన్నిసార్లు ఆత్మహత్యకూ దారితీయొచ్చు.

చికిత్స ఉందా: ఇది చాలామందిలో కనిపించేదే! సరైన సమయంలో నిపుణులను సంప్రదిస్తే కోలుకోవడమూ సులువే. అంతవరకూ రావొద్దంటే.. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. చల్లగా ఉందని బద్ధకించకుండా రోజూ కొంత సమయం వ్యాయామానికి కేటాయించండి. వేడివేడిగా అంటూ టీ, కాఫీలను అతిగా తీసుకోవద్దు. ఇంట్లో చేసిన, ఆరోగ్యకరమైన పోషకాహారానికే ప్రాధాన్యం ఇవ్వండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్