నెలసరిలో తీపిపై మనసా?

హార్మోనుల్లో మార్పులు నెలసరిలో తీపి పదార్థాలవైపు మనసు మళ్లేలా చేస్తాయి. తీపి తింటే అనారోగ్యం. మరేం చేయాలంటారా.. చిట్కాలివిగో!

Published : 29 Mar 2023 00:04 IST

హార్మోనుల్లో మార్పులు నెలసరిలో తీపి పదార్థాలవైపు మనసు మళ్లేలా చేస్తాయి. తీపి తింటే అనారోగ్యం. మరేం చేయాలంటారా.. చిట్కాలివిగో!

* తీపి తినాలనిపిస్తే గ్లాసు మంచినీటిని తాగేయండి. శరీరం డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు కూడా తీపి వైపు ఆలోచన వెళుతుంది. అప్పుడు నీటిని తాగితే ఆలోచన దూరమవుతుంది.

* అరటి, యాపిల్‌, నారింజ వంటి పండ్లలో ఏదైనా ఒకదానిని తీసుకోండి. కడుపూ నిండుతుంది. తీపి తిన్న భావన కూడా!

* ఇటువంటి సందర్భాల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉండే ఆహారానికి ప్రాధాన్యమివ్వాలి. చికెన్‌, చేప, గుడ్లు, పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, కిడ్నీ బీన్స్‌, చిక్కుడు వంటివి ఆహారంలో చేర్చుకోండి.

* మనసుకు నచ్చిన స్నేహితులు, శ్రేయోభిలాషులతో కాసేపు మాట్లాడండి. మనసును మరో విషయం వైపు మళ్లేలా చేసినా తీపి ఆలోచన దూరమవుతుంది.

* నిద్రలేమి ఉంటే సరిచేసుకోవాలి. గోరువెచ్చని నీటితో స్నానం చేసి గంటసేపు హాయిగా నిద్రపోయి లేస్తే చాలు. మనసంతా ఉల్లాసంగా అనిపిస్తుంది. తీపి ఆలోచనా ఉండదు.

* కంటికెదురుగా చాక్లెట్లు, స్వీట్లు వంటివి లేకుండా జాగ్రత్తపడాలి. వాటిని చూస్తూ ఉంటే తినాలనే కోరిక పెరుగుతుంది.

* శరీరంలో విటమిన్ల లోపం ఉన్నా తీపి తినాలనిపించే అవకాశాలెక్కువ. వైద్యుల సలహాతో మల్టీ విటమిన్‌ ట్యాబ్లెట్‌ వేసుకోవడం మంచిది.

* అల్పాహారానికి, భోజనానికి మధ్య మరీ ఎక్కువ సమయం ఉండొద్దు. కనీసం రెండు మూడు గంటలకు ఒకసారి కొద్ది మొత్తంలో ఎక్కువసార్లు ఆహారం తీసుకోండి. అప్పుడు మాటిమాటికీ ఆకలి వేయదు. తీపి తినాలన్న ఆలోచనా దరి చేరదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్