వాటికి చోటిస్తే అంతే...

మారిన జీవనశైలి... వ్యక్తిగత జీవితాల్లో ఏకాంతాన్నీ, సంతోషాన్నీ దూరం చేస్తోంది. ఫలితంగానే దాంపత్యంలో అభద్రత, అసహనం, ఒత్తిడి వంటివి పెత్తనం చేస్తున్నాయి. వీటికి ముకుతాడు వేయకపోతే ఇబ్బందులు తప్పవు. ఇలాంటప్పుడు ఏం చేయాలో చెబుతున్నారు మానసిక నిపుణులు.

Updated : 13 Dec 2022 04:07 IST

మారిన జీవనశైలి... వ్యక్తిగత జీవితాల్లో ఏకాంతాన్నీ, సంతోషాన్నీ దూరం చేస్తోంది. ఫలితంగానే దాంపత్యంలో అభద్రత, అసహనం, ఒత్తిడి వంటివి పెత్తనం చేస్తున్నాయి. వీటికి ముకుతాడు వేయకపోతే ఇబ్బందులు తప్పవు. ఇలాంటప్పుడు ఏం చేయాలో చెబుతున్నారు మానసిక నిపుణులు.

నొచ్చుకోనివ్వద్దు...

ఒకే ఇంట్లో ఉంటున్నాం ప్రత్యేక సమయం ఎందుకూ అనొద్దు. చిన్న చిన్న విషయాలే మనసుని నొప్పిస్తాయి. అభద్రత దూరం కావాలంటే... చిన్న చిన్న ప్రశంసలూ, నేనున్నానే భరోసా భాగస్వామికి ఇవ్వాలి. అలాగని ఏదో మాట వరసకు చెప్పి తప్పించుకోవాలనుకోవద్దు. మనసు విప్పి మాట్లాడండి. ఇందుకోసం టీ, కాఫీ తాగినప్పుడో, నడకకు వెళ్లినప్పుడో ఆ పని తోడుగా చేయండి.

వర్చువల్‌ వద్దేవద్దు...

అంతర్జాలం వ్యక్తిగత జీవిత సమయాన్ని బాగా దెబ్బ తీస్తోందని అధ్యయనాలు చెబుతున్నాయి. దినచర్యను తరచి చూసుకుంటే అది మీకే అర్థం అవుతుంది. రోజులో అన్నింటికీ ఓ ప్రణాళిక ఉన్నట్లే... భాగస్వామితో మాట్లాడేందుకూ కచ్చితంగా సమయాన్ని కేటాయించుకోవాలి. ఎదురెదురుగా కూర్చున్నా ఫోనులకో, టీవీలకో అతుక్కుపోకండి. భోజనం చేస్తున్నప్పుడూ, పడక గదిలోకి ఫోనులూ, ల్యాప్‌ట్యాప్‌లూ తీసుకెళ్లొద్దు. ఇది మీకు బోలెడు సమయాన్ని ఇస్తుంది.

అది నిర్లక్ష్యం కాదు..

బాధ్యతలు పెరుగుతోన్నప్పుడు ఒత్తిడితో చిరాకులూ, పరాకులూ ఎదురవ్వొచ్చు. అంతమాత్రాన మీరంటే ఇష్టం లేదనీ, మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారనీ అనుకోవద్దు. వారి ఇబ్బందులను అర్థం చేసుకోండి. సమస్యల సాధనకు సాయం చేయండి. అప్పుడు ఇద్దరూ సంతోషంగా సాగిపోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్