హద్దులు.. పెట్టాల్సిందే

అయిన వారు, స్నేహితులు ఎవరైనా సరే! వ్యక్తిగతం అనేది లేకుండా ప్రతి విషయంలోనూ సలహాలిస్తున్నారా? దుస్తులు, వృత్తి ఇలా ప్రతిదానిలో నిర్ణయానికి అడ్డుపడుతున్నారా? మొదట ఊరుకున్నా తర్వాత్తర్వాత ఇవి మానసిక ఒత్తిడికి దారితీస్తాయి.

Published : 10 Apr 2023 00:49 IST

అయిన వారు, స్నేహితులు ఎవరైనా సరే! వ్యక్తిగతం అనేది లేకుండా ప్రతి విషయంలోనూ సలహాలిస్తున్నారా? దుస్తులు, వృత్తి ఇలా ప్రతిదానిలో నిర్ణయానికి అడ్డుపడుతున్నారా? మొదట ఊరుకున్నా తర్వాత్తర్వాత ఇవి మానసిక ఒత్తిడికి దారితీస్తాయి. కాబట్టి..

* ఎవరైనా మితిమీరి మిమ్మల్ని అదుపులో పెట్టాలని చూసినప్పుడు మొదట్లోనే గమనించండి. మీ భావాలను వ్యక్తపరిచేందుకు ఏమాత్రం వెనకాడొద్దు. మొహమాట పడి చెప్పలేకపోతే ప్రతి సారీ ఇబ్బంది పడుతూనే ఉంటారు.

* వేరేవాళ్లకి సంబంధించి మీకు సాధ్యం కాని ఏ పనినీ బలవంతంగా ఒప్పుకోవద్దు. అది సమయానికి పూర్తి చేయలేకపోతే ఒత్తిడికి లోనవుతారు.

* వారి హద్దులేంటో అవతలి వారికి అర్థమయ్యేలా వివరించి చెప్పండి. అలాగని అరిచి చెప్పొద్దు. మీపై చెడు అభిప్రాయం ఏర్పడుతుంది.

* సొంత వారిని హద్దుల్లో పెట్టడం కష్టమే. కానీ అది మనకు సమస్యగా మారినప్పుడు తప్పదు. లేదంటే చిక్కుల్లో పడేది మనమే. ఏమనుకుంటారో అని ఆలోచించినంత కాలం ఇబ్బంది తప్పదు. కాబట్టి.. హద్దులు నిర్ణయించేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్