బిడియాన్ని తగ్గించేయండిలా...
కొంతమంది పిల్లలు గడపదాటి బయటికి వెళ్లడానికి జంకుతారు. భయంతో బిగుసుకుపోతారు. ఎవరితోనైనా మాట్లాడాల్సి వస్తే బిడియం. స్కూల్లో స్టేజీపై ప్రదర్శనలంటే ఇక అంతే సంగతులు.
కొంతమంది పిల్లలు గడపదాటి బయటికి వెళ్లడానికి జంకుతారు. భయంతో బిగుసుకుపోతారు. ఎవరితోనైనా మాట్లాడాల్సి వస్తే బిడియం. స్కూల్లో స్టేజీపై ప్రదర్శనలంటే ఇక అంతే సంగతులు. ఈ భయాన్ని చిన్నప్పుడే పోగొట్టి ధైర్యాన్ని నింపకపోతే పెద్దయ్యాక కూడా ఇలానే ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
* ముందుగా పిల్లల్లోని చిన్న చిన్న భయాల్ని అర్థం చేసుకోవాలి. ఏ సమస్య వచ్చినా... వెంట మీరున్నారనే భద్రత కల్పించాలి. ఇంట్లోవారితో, చుట్టుపక్కలవారితోనూ స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితుల్ని కల్పించాలి.
* ఏ చిన్న పని చేసినా కొందరు విమర్శిస్తూనే ఉంటారు. మీ పిల్లల విషయంలో ఆ తీరుకి దూరంగా ఉండండి. ఇలా చేయి, అలా మాట్లాడు అంటూ సలహాలు ఇచ్చేయకండి. అలానే, ఏదైనా పనిలో విఫలమైతే నీవల్ల కాదని నిరుత్సాహపరచకండి. ఎందుకంటే ఆలోచనలూ, ఆచరణలకూ కొంత స్వేచ్ఛ ఇచ్చినప్పుడే వారు భయాల్ని పోగొట్టుకుని చక్కగా వ్యక్తీకరించగలరు. లేదంటే అన్నింటిపైనా నిరాసక్తత పెంచుకునే ప్రమాదం ఉంది.
* పిల్లలకు సానుకూలంగా ఆలోచించడం నేర్పాలి. నేను చేయలేనేమో, నాకు రాదేమో అన్న భయాల్ని దూరం చేయడానికి వీలైనంత ఎక్కువగా సాధన చేయించాలి. తమపై తమకు నమ్మకాన్ని పెంచాలి. ఒకవేళ ఓడిపోయినా తప్పేం లేదనీ, అది మరోసారి... విజయానికి దగ్గర చేస్తుందనీ ధైర్యాన్ని నింపాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.