ఆ తీరు బాధిస్తోంటే..

ఎవరైనా ఇబ్బంది పెట్టినా.. చిన్న చిన్న అసంతృప్తులేవైనా ఇంట్లోనే చెబుతాం. తీరా ఆయనేమో ‘ఇదంతా మామూలే’ అన్నట్టు పట్టించుకోకుండా వెళ్లడం, ఇక చాలు ఆపమనడం ఎంత బాధిస్తుందో కదా!  అందుకే.. ఎలాగూ పట్టించుకోరులే అనో, చెప్పినా వృథా అనో మనసులోనే దాచేసుకుంటాం.

Published : 10 Aug 2023 00:01 IST

ఎవరైనా ఇబ్బంది పెట్టినా.. చిన్న చిన్న అసంతృప్తులేవైనా ఇంట్లోనే చెబుతాం. తీరా ఆయనేమో ‘ఇదంతా మామూలే’ అన్నట్టు పట్టించుకోకుండా వెళ్లడం, ఇక చాలు ఆపమనడం ఎంత బాధిస్తుందో కదా!  అందుకే.. ఎలాగూ పట్టించుకోరులే అనో, చెప్పినా వృథా అనో మనసులోనే దాచేసుకుంటాం. అదీ ఒత్తిడేనని తెలుసా?

ఒకటి, రెండుసార్లకు బాధపడిపోయి నేనెంత చెప్పినా అంతే.. వినరని బాధపడక్కర్లేదు. ఆఫీసు, ఆర్థిక ఒత్తిళ్లు వగైరా కారణమై ఉండొచ్చు. అంతమాత్రాన మీరంటే లెక్కలేదనో, ప్రేమ లేదనో భావించొద్దు. అసలు చెబుతున్న విషయాన్నీ వినుండకపోవచ్చు. తరచూ ఇలా జరుగుతోంటే తప్ప దీన్ని పట్టించుకోవద్దు. ఇంకా నిజంగా మీరు చెప్పేవన్నీ ఆయన దృష్టివరకూ తీసుకెళ్లదగ్గవేనా? దీన్నీ ఆలోచించుకోండి.

 నిజంగానే మీరు చెప్పే ప్రతి విషయాన్నీ తీసిపారేస్తున్నారా? మనసులో ఉంచుకొని బాధపడితే ఏం లాభం? నేరుగా వెళ్లి మాట్లాడండి. అతని ప్రవర్తన మిమ్మల్ని ఎంతగా ఇబ్బందిపెడుతోందో చెప్పండి. అయితే మీ మనసులోని భారాన్ని మాత్రమే చెప్పండి. ఆ సంభాషణ నిందిస్తున్నట్లుగా మాత్రం ఉండొద్దు. అలాగే మీ ప్రవర్తనలో తనను ఇబ్బంది పెట్టేవి ఏమైనా ఉన్నాయేమో కూడా కనుక్కుంటే సరి. ఉదాహరణకు మీరు అతని తరపు వాళ్లపై ఏదైనా తరచూ చెబుతున్నారనుకోండి అది అతనికి నచ్చకపోవచ్చు. దాంతో వినడానికి అయిష్టత చూపించొచ్చు. అలాంటివేమైనా ఉంటే తెలుస్తాయి. అవసరమైతే మీ తీరునీ మార్చుకోవచ్చు.

 మనకు మనసు బాగాలేకపోవడానికి బయటి అంశాలే కాదు.. హార్మోనుల్లో తేడాలూ కారణమే. ఇవన్నీ మగవాళ్లు అన్నిసార్లూ అర్థం చేసుకోలేకపోవచ్చు. మీ గురించి తెలిసిన స్నేహితులో, తోబుట్టువుల సాయమో తీసుకోండి. మనసు భారమూ తగ్గుతుంది. ప్రతి చిన్న విషయానికీ ఆధార పడుతుందన్న అభిప్రాయం అతనికీ ఉండదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్