Dear Vasundhara: ఆయన.. ఆఫీసు.. నలిగిపోతున్నా!

ఈమధ్యే పెళ్లైంది. సహోద్యోగినే చేసుకున్నా. తరచూ తన డిపార్ట్‌మెంట్‌కీ మాకూ మీటింగ్‌లు ఉంటాయి. ఏదైనా పాయింట్‌ నచ్చి తనకు వత్తాసు పలికితే మీ ఆయనని సపోర్ట్‌ ఇస్తున్నావా అని టీమ్‌వాళ్లు, నచ్చక విభేదిస్తే నువ్వు కూడా నాకు తోడుండవా అని ఈయన అంటున్నారు. ఏం మాట్లాడకపోయినా సమస్యగానే ఉంది.

Updated : 11 Oct 2023 13:08 IST

ఈమధ్యే పెళ్లైంది. సహోద్యోగినే చేసుకున్నా. తరచూ తన డిపార్ట్‌మెంట్‌కీ మాకూ మీటింగ్‌లు ఉంటాయి. ఏదైనా పాయింట్‌ నచ్చి తనకు వత్తాసు పలికితే మీ ఆయనని సపోర్ట్‌ ఇస్తున్నావా అని టీమ్‌వాళ్లు, నచ్చక విభేదిస్తే నువ్వు కూడా నాకు తోడుండవా అని ఈయన అంటున్నారు. ఏం మాట్లాడకపోయినా సమస్యగానే ఉంది. ఆయనకీ, ఆఫీసు వాళ్లకీ మధ్య నలిగిపోతున్నా. బయటపడేదెలా?

- హేమలత

పని ప్రదేశంలోనూ మీవారితో జరిగిన గొడవ గురించి ఆలోచించడం.. ఆయనతో కలిసి ట్రిప్‌లు వగైరా ప్లానింగ్‌ చేయడం వంటివి చేస్తున్నారా? మామూలుగా జరిగేవే కానీ.. తెలియకుండానే ఇబ్బందులూ తెచ్చిపెడతాయి. కాబట్టి, ఒకేచోట పనిచేసే దంపతులు మొదట అనుసరించాల్సిన సూత్రం ఇంట్లో విషయాలు ఆఫీసుకీ, అక్కడ చర్చలు ఇంట్లో రాకుండా చూసుకోవడం. ఓ అరగంట పరిమితి పెట్టుకోండి. పని వేళలయ్యాక చిరాకులు, పరాకులేమున్నా ఆ సమయంలోనే బయటపెట్టేయాలి. ఆ తర్వాత ఆఫీసు చర్చలేమీ ఇంట్లో రావొద్దన్న నియమం పెట్టుకోండి. ఇక ఆఫీసులో.. ఎంత ప్రయత్నించినా ఒకరికొకరు సాయపడుతున్నారన్న కామెంట్‌ వస్తూనే ఉంటుంది. ఇక భర్తో, భార్యో ఉన్నత స్థానంలో ఉన్నవారైతే ప్రమోషన్‌, ప్రశంస ఏదొచ్చినా భాగస్వామి వల్లే అనేస్తారు. కాబట్టి, మీ వ్యక్తిగత విషయాలను ఆఫీసులో చర్చించడం, ముద్దు పేరుతో పిలవడం, ఆయన పనికి సంబంధించి ఏమైనా అన్నా ఆఫీసులో చెప్పడం లాంటివేమీ చేయొద్దు. హుందాగా ప్రవర్తించండి. మీటింగ్‌లో తన ఆలోచనకు వత్తాసు పలికినా, వ్యతిరేకించినా తోటివారితో చర్చించండి. ఆపైనే నిర్ణయాన్ని చెప్పండి. మీవారి డిపార్ట్‌మెంట్‌తో విభేదాలొచ్చినా బృందానికే మీ సపోర్ట్‌ అన్న మెసేజ్‌ ఇవ్వగలగాలి. నిజానికి మీది చాలా కష్టమైన పరిస్థితే! కానీ పని మధ్యలోకి బంధాన్ని తేనని చెబుతూ పాటిస్తూ వెళితే సమస్య నుంచి బయటపడటం సులువే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్