తక్కువ మంది ఉంటే... ఎక్కువ మార్కులేం రావు...!

చాలా స్కూళ్లు మేం తరగతి గదుల్లో ఎక్కువ మంది పిల్లల్ని కూర్చోబెట్టం, మా బోధనే ప్రత్యేకం అంటూ ఢంకా బజాయిస్తూ చెబుతుంటాయి.

Published : 14 Mar 2024 01:07 IST

చాలా స్కూళ్లు మేం తరగతి గదుల్లో ఎక్కువ మంది పిల్లల్ని కూర్చోబెట్టం, మా బోధనే ప్రత్యేకం అంటూ ఢంకా బజాయిస్తూ చెబుతుంటాయి. అయితే వాస్తవానికి తరగతి గదుల్లో తక్కువమంది విద్యార్థులకే బోధించినా, ఆర్థికంగా వెనకబడిన పిల్లల మార్కుల్లో ఎటువంటి పురోగతీ లేదని థైజు యూనివర్సిటీ చేసిన పరిశోధనల్లో వెల్లడైంది. అంతేకాదు పైగా ఇది పిల్లలు విజయం సాధించే అవకాశాల్నీ తగ్గిస్తుందట. మొత్తం 2700 మంది హైస్కూల్‌ విద్యార్థులపై ఈ అధ్యయనం చేశారు. వారందరూ ‘ప్రోగ్రామ్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ స్టూడెంట్‌ అసెస్‌మెంట్‌’ అనే సర్వేలో పాల్గొన్నారు. అందులో రీడింగ్‌, గణితం, సైన్సులలో వారికున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే సామర్థ్యం ఎలా ఉందో అంచనా వేశారు. దాంతోపాటు క్లాస్‌ రూమ్‌ పరిస్థితులు, స్కూల్‌ రిసోర్సులు, సంస్కృతీ... వంటి భిన్న అంశాలను పరిగణనలోకి తీసుకున్నారట. మరో ముఖ్య విషయం ఏంటంటే... పిల్లల సంఖ్యకూ, వాళ్ల మార్కులకీ సంబంధం లేదట. అందుకే క్లాస్‌ రూముల్లో పిల్లల సంఖ్యను తగ్గించే విధానం కంటే నైపుణ్యాలున్న టీచర్లను నియమించుకోవడం వల్ల మంచి ఫలితాలు అందుకోవచ్చని స్కూలు యాజమాన్యాలకు సూచిస్తున్నారు పరిశోధకులు. అప్పుడే పిల్లల్లోనూ స్థిత ప్రజ్ఞత పెరుగుతుందని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్