ఒలింపిక్స్‌లో మన సంఖ్య పెరిగింది

ఒలింపిక్స్‌ కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఏ దేశం ఎన్ని పతకాలను సాధిస్తుందోనన్న చర్చలు, అంచనాలూ షరామామూలే. కానీ తెలుసా.. ఈసారి పోటీల్లో ఓ ఆసక్తికర అంశం జోడైంది. అదేంటంటే..

Published : 20 Jul 2021 00:50 IST

లింపిక్స్‌ కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఏ దేశం ఎన్ని పతకాలను సాధిస్తుందోనన్న చర్చలు, అంచనాలూ షరామామూలే. కానీ తెలుసా.. ఈసారి పోటీల్లో ఓ ఆసక్తికర అంశం జోడైంది. అదేంటంటే.. అమ్మాయిలకు ప్రాముఖ్యం పెరగడం. టోక్యో ఒలింపిక్స్‌ థీమ్‌ ‘జెండర్‌ బ్యాలెన్స్‌’. ఈసారి 49% మంది మహిళలు పాల్గొనేలా చూస్తామని అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ ముందుగానే ప్రకటించింది. దీనికి సమర్థనగానా అన్నట్టు పెద్ద దేశాల నుంచి అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా బరిలోకి దిగుతున్నారు.

ఈ క్రీడల ఆతిథ్య దేశం జపాన్‌ నుంచి పాల్గొంటున్న 552 మంది ఆటగాళ్లలో 259 మంది అమ్మాయిలు (47 %), 293 మంది అబ్బాయిలు. మనదేశం నుంచి 127 మంది క్రీడాకారులు పాల్గొంటుండగా 71 మంది పురుషులు, 56 మంది మహిళలు. అంటే 44 శాతం అన్నమాట. ప్రారంభోత్సవంలోనూ పోటీ పడుతున్న అన్ని జాతీయ పారాలింపిక్‌ కమిటీలూ తమ జెండాను ఒక మహిళ, ఒక మగ అథ్లెట్‌ ప్రదర్శించేలా ప్రోత్సహిస్తారు. టోక్యో 2020 ఆర్గనైజింగ్‌ కమిటీ బోర్డులో మహిళల శాతాన్ని 42కు పెంచారు. ఒలింపిక్స్‌ వంటి ప్రతిష్ఠాత్మక పోటీల్లో గెలవడం కంటే పాల్గొనడం ముఖ్యమని నిర్వాహకుల్లో ఒకరన్నారు. నిజమే మరి! ముందు అవకాశమంటూ వస్తేనే కదా... గెలుపు సాధ్యమయ్యేది. ఈ ఆలోచన క్రీడారంగంలో అమ్మాయిల ప్రాతినిధ్యం పెరిగేందుకు దోహదపడుతుందని ఆశిద్దాం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్