రష్మిక విజయ రహస్యమిదేనట!

వరుస విజయాలతో, కొత్త ప్రాజెక్టులతో రష్మిక మందన్న దూసుకెళుతోంది. తన విజయ రహస్యాన్ని ఇన్‌స్టా వేదికగా పంచుకుందిలా.. ‘ఎప్పుడైనా మంటల్లో నడిచారా? పోలిక, భయం, అపజయం..

Updated : 01 Dec 2021 05:48 IST

వరుస విజయాలతో, కొత్త ప్రాజెక్టులతో రష్మిక మందన్న దూసుకెళుతోంది. తన విజయ రహస్యాన్ని ఇన్‌స్టా వేదికగా పంచుకుందిలా.. ‘ఎప్పుడైనా మంటల్లో నడిచారా? పోలిక, భయం, అపజయం.. మిమ్మల్ని భయపెట్టే ఆ నిప్పు రూపం ఇలా ఏదైనా కావొచ్చు. దాన్ని అధిగమించే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? రెండు సూత్రాలను పాటిస్తే సులువుగా చేయొచ్చు.

1. ముందు మిమ్మల్ని ఆపే ఆ అడ్డంకి ఏంటో గుర్తించండి.

2. రోజూ ఓపిగ్గా దాన్ని అధిగమించే ప్రయత్నం చేయండి. భయపడేదాన్నే మళ్లీ మళ్లీ ప్రయత్నించండి. ఏదోరోజు ఇక అది మిమ్మల్ని ఆపలేకపోవడం మీరే గమనిస్తారు.

నేను అధిగమించాను కాబట్టే చెబుతున్నాను. గత కొన్నేళ్లుగా.. నేటికీ దీన్ని ప్రయత్నిస్తున్నాను’. ఈ పోస్ట్‌ ఎంతోమంది మనసుల్ని గెలుచుకుంటోంది. మంచి సలహా అంటూ కామెంట్లూ పోటెత్తుతున్నాయి. అమ్మాయిలూ.. రష్మిక సలహా మీరూ ప్రయత్నించండి మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్