అమ్మానాన్నల త్యాగ ఫలమే!

విజయం ఎవరికీ అంత సులభంగా రాదు. ఎన్నో ఏళ్లపాటు త్యాగాలు చేయాలి. నా విషయంలో నాతోపాటు అమ్మానాన్నా కూడా త్యాగాలు చేస్తూ వచ్చారు. నేనింకా నైపుణ్యాలూ, ఆత్మవిశ్వాసం పెంపొందించుకుంటున్న దశలోనే అమ్మానాన్నలు నా కెరియర్‌ గురించి చూపిన అంకితభావం నన్నెంతో ఆశ్చర్యపరిచేది. నాకు అండగా నిలవడానికి మంచి ఉద్యోగాల్నీ వదులుకున్నారు.

Updated : 22 Oct 2022 01:20 IST

అనుభవ పాఠాలు

విజయం ఎవరికీ అంత సులభంగా రాదు. ఎన్నో ఏళ్లపాటు త్యాగాలు చేయాలి. నా విషయంలో నాతోపాటు అమ్మానాన్నా కూడా త్యాగాలు చేస్తూ వచ్చారు. నేనింకా నైపుణ్యాలూ, ఆత్మవిశ్వాసం పెంపొందించుకుంటున్న దశలోనే అమ్మానాన్నలు నా కెరియర్‌ గురించి చూపిన అంకితభావం నన్నెంతో ఆశ్చర్యపరిచేది. నాకు అండగా నిలవడానికి మంచి ఉద్యోగాల్నీ వదులుకున్నారు. అమ్మ నాకు అసలైన దన్ను. ఇప్పటికీ మ్యాచ్‌ ఓడిపోయినా, ఇంకేదైనా సమస్య ఉన్నా అమ్మతోనే మాట్లాడతాను. తన ఓదార్పు, సలహా నన్ను అందులోంచి బయట పడేస్తాయి. క్రీడాకారుల కుటుంబాలూ ఎన్నో త్యాగాలు చేస్తాయి. వాటి గురించి బయటి ప్రపంచానికి పూర్తిగా తెలియదు. కానీ క్రీడాకారుల గుండెల్లో అవి ఎప్పటికీ నిలిచిపోతాయి. దేశంలో క్రీడల పరంగా చాలా వేగంగా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా నీరజ్‌ చోప్రా ఒలింపిక్‌ స్వర్ణం తర్వాత. స్కూల్‌ స్థాయిలో క్రీడలకు ప్రాధాన్యం పెరగాలి. పిల్లలు క్రీడల్లాంటి సంప్రదాయేతర రంగాల్లో అడుగుపెట్టాలంటే ముందు అమ్మానాన్నల ఆలోచనల్లో మార్పు రావాలి.

- పీవీ సింధు, డబుల్‌ ఒలింపిక్‌ పతక విజేత

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని