అఘాయిత్యం జీవితాన్నే దెబ్బతీస్తోంది

స్త్రీలపై లైంగిక అఘాయిత్యాల ప్రభావం... ఎంత వరకూ ఉంటుంది? కొన్ని రోజుల తర్వాత శరీరానికి అయిన గాయంతో పాటు జ్ఞాపకాలు కూడా మానిపోతాయా? బాధితులు సాధారణ జీవితం గడిపే అవకాశం ఉందా? ఇవే విషయాలపై తాజాగా పిట్స్‌బర్గ్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఒక సర్వే జరిగింది. అందులో వెల్లడైన వాస్తవాలివి..

Updated : 26 Sep 2021 05:38 IST

స్త్రీలపై లైంగిక అఘాయిత్యాల ప్రభావం... ఎంత వరకూ ఉంటుంది? కొన్ని రోజుల తర్వాత శరీరానికి అయిన గాయంతో పాటు జ్ఞాపకాలు కూడా మానిపోతాయా? బాధితులు సాధారణ జీవితం గడిపే అవకాశం ఉందా? ఇవే విషయాలపై తాజాగా పిట్స్‌బర్గ్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఒక సర్వే జరిగింది. అందులో వెల్లడైన వాస్తవాలివి..

తీవ్రమైన లైంగిక వేధింపులు, అత్యాచారాలకు గురైన అమ్మాయిల్లో తాత్కాలిక ఉపశమనం లభించినా దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తడానికి ఆస్కారం ఉందని తేలింది. ముఖ్యంగా మెదడు పనితీరు మందగిస్తూ వస్తుందని ఈ అధ్యయనం చెబుతోంది. పిట్స్‌బర్గ్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని విమెన్స్‌ బయో బిహేవియరెల్‌ హెల్త్‌ లాబొరేటరీ... చిన్నతనంలో, పెద్దయ్యాక లైంగిక వేధింపులకు గురై నడివయసులో ఉన్న మహిళల్ని ఈ సర్వేలో భాగస్వాములని చేసింది. వాళ్ల మెదడుని స్కాన్‌ చేసినప్పుడు చాలా మందిలో మెదడు కణాలు క్షీణించడాన్ని గుర్తించింది. ఫలితంగా వారిలో మరుపు పెరుగుతోంది. అలాగే వీరిలో మూడురెట్లు ఎక్కువగా ట్రైగ్లిజరాయిడ్లు ఉంటున్నాయని వీటి కారణంగా గుండెజబ్బులు తలెత్తు తున్నాయనీ, వీటికి ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమి వంటివి కూడా తోడై మహిళల జీవితాలని దెబ్బ తీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే లైంగిక వేధింపుల బాధితులకు ఉపశమనం కలిగించేలా కౌన్సెలింగులు ఇవ్వడం, వారి మనసులోని మాటను బయటకు చెప్పేలా ప్రోత్సహించడం అవసరం అంటోంది ఈ అధ్యయనం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్