ఎలా కావాలంటే అలా..

పసిపిల్లలకు తినిపించాలంటే చాలా ఓపిక కావాలి. రోజంతా వాళ్లని చంకనేసుకుని తిప్పితే ఓ ముద్ద తింటారు. ఈలోపు మనం నీరసించిపోతాం. మీరూ ఈ జాబితాలో ఉంటే... మీ చిన్నారి కోసం ఈ కన్వర్టబుల్‌ హైచెయిర్‌ని కొనేయండి. కదిలే ఈ కుర్చీ ఎత్తుని మీకనుగుణంగా పెంచుకోవచ్చు.

Updated : 08 Oct 2021 01:36 IST

పసిపిల్లలకు తినిపించాలంటే చాలా ఓపిక కావాలి. రోజంతా వాళ్లని చంకనేసుకుని తిప్పితే ఓ ముద్ద తింటారు. ఈలోపు మనం నీరసించిపోతాం. మీరూ ఈ జాబితాలో ఉంటే... మీ చిన్నారి కోసం ఈ కన్వర్టబుల్‌ హైచెయిర్‌ని కొనేయండి. కదిలే ఈ కుర్చీ ఎత్తుని మీకనుగుణంగా పెంచుకోవచ్చు... తగ్గించుకోవచ్చు. తినిపిస్తున్నప్పుడు చుట్టూ ఎంగిళ్లు పడతాయనే సమస్యా ఉండదు. కుర్చీకి ఏర్పాటు చేసిన ట్రేని తొలగించి శుభ్రం చేసి వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. మీరు తినే డైనింగ్‌టేబుల్‌ ఎత్తుకు సమానంగా ఈ కుర్చీని అమర్చుకుంటే మీరు వంగి తినిపించాల్సిన అవసరం ఉండదు. బుజ్జాయిలూ మీతో పాటు కలిసితింటారు. కాస్త ఎదగ్గానే అయ్యో కుర్చీ పనికిరాదే అనే బాధ ఉండదు.. ఎత్తు తగ్గించుకుంటూ నాలుగైదేళ్ల వరకూ వాడేసుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్