ప్రతి బాలికా ఓ శక్తే

శరన్నవరాత్రుల రెండోరోజు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ బాలా త్రిపుర సుందరీదేవి రూపంలో దర్శనమిస్తుంది. ఈ రోజున రెండు నుంచి పదేళ్ల లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి.. పూజించి కొత్త బట్టలు పెడతారు. అమ్మవారికి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగు చీరలు కట్టి పాయసం, గారెలను నివేదిస్తారు.

Updated : 08 Oct 2021 01:33 IST


అరుణ కిరణ జాలై రంజితాశావకాశా / విదృత జపతటీకా పుస్తకాభీతిహస్తా / ఇతరవకరాఢ్యా ఫుల్లకల్హారసంస్థా / నివసతు హృదిబాలా నిత్యకల్యాణశీలా

శరన్నవరాత్రుల రెండోరోజు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ బాలా త్రిపుర సుందరీదేవి రూపంలో దర్శనమిస్తుంది. ఈ రోజున రెండు నుంచి పదేళ్ల లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి.. పూజించి కొత్త బట్టలు పెడతారు. అమ్మవారికి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగు చీరలు కట్టి పాయసం, గారెలను నివేదిస్తారు. బాలాత్రిపుర సుందరిని పూజించడమంటే.. మహిళల్ని చిన్నతనం నుంచే పవిత్ర భావం, గౌరవంతో ఆదరించాలని అర్థం. తొమ్మిదేళ్ల బాలిక రూపంలో అమ్మవారు ముప్పై మంది రాక్షసుల్ని సంహరించారని బ్రహ్మాండ పురాణ గాథ. ప్రతి అమ్మాయీ బాల్యం నుంచి.... సమాజంలోని చీకటి కోణాల్ని, చెడుల్ని గుర్తించాలని అమ్మ ఆరాధన సూచిస్తోంది. అవసరమైతే దుష్టుల చేష్టలను ఓ కంట కనిపెట్టి తగిన తీరులో సమాధానం చెప్పాలని బాలాదేవి ఆరాధన చెబుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్