శత్రు భయంకరి

అయిగిరినందిని, నందితమోదిని, విశ్వవినోదిని నందినుతే గిరివరవింధ్య శిరోధినివాసిని, విష్ణువిలాసిని, జిష్ణునుతే భగవతి హే శితికంఠ కుటుంబిని, భూరి కుటుంబిని భూరికృతే జయజయహే మహిషాసురమర్థిని రమ్యకపర్దిని శైలసుతే...

Updated : 14 Oct 2021 05:02 IST

అయిగిరినందిని, నందితమోదిని, విశ్వవినోదిని నందినుతే గిరివరవింధ్య శిరోధినివాసిని, విష్ణువిలాసిని, జిష్ణునుతే భగవతి హే శితికంఠ కుటుంబిని, భూరి కుటుంబిని భూరికృతే జయజయహే మహిషాసురమర్థిని రమ్యకపర్దిని శైలసుతే

దుష్టుడైన మహిషాసరుడిని అంతమొందించిన భీకర శక్తి స్వరూపిణి మహిషాసుర మర్థిని రూపంలో నవమినాడు అమ్మ దర్శనమిస్తుంది. ఎనిమిది భుజాలు.. అష్ట ఆయుధాలు... సింహవాహినిగా.. రౌద్ర రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే.. శత్రు భయం ఉండదని భక్తుల విశ్వాసం. మహిషుడు అనే రాక్షసుడి సంహారానికే అమ్మవారు మహిషాసుర మర్దినిగా అవతరించిందని దేవీ భాగవతం చెబుతోంది. దున్నపోతు రూపంలో ఉన్నాడు ఆ అసురుడు. ఏమీ ఆలోచించకపోవడం, దుడుకుతనం, సోమరితనం, దుర్మార్గం అతడి లక్షణాలు. నేటి ఆడపిల్లల చుట్టూ ఎందరో మహిషాసురులు కనిపిస్తున్నారు. ఆనాడు మహిషుడు అమ్మవారి పట్ల కాముక ప్రవృత్తిని ప్రకటించాడు. నేడు అడుగడుగునా ఇలాంటి మానవ మహిషాసురులెందరో కనిపిస్తున్నారు. అలాంటి పరిస్థితులు ఎదురైతే బెంబేలు పడకుండా ఆ మహిషుల్ని మర్దించగల శక్తి తనలో దాగి ఉందని ప్రతి స్త్రీ గుర్తించాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్