పర్యావరణానికి నేస్తంగా..

పర్యావరణ పరిరక్షణ విషయంలో మహిళలదీ ప్రధాన పాత్రే. అయితే ఏమీ చేయలేక పోతున్నామని బాధపడుతున్నారా! జీవనశైలిని కొద్దిగా మార్చుకుంటే, మనమూ అందులో భాగస్వాములైనట్లే. ఇందుకేం చేయాలంటే....

Published : 20 Oct 2021 00:37 IST

పర్యావరణ పరిరక్షణ విషయంలో మహిళలదీ ప్రధాన పాత్రే. అయితే ఏమీ చేయలేక పోతున్నామని బాధపడుతున్నారా! జీవనశైలిని కొద్దిగా మార్చుకుంటే, మనమూ అందులో భాగస్వాములైనట్లే. ఇందుకేం చేయాలంటే....

వంటింట్లో... ఎకోఫ్రెండ్లీ పద్ధతిని వంటింట్లోంచి మొదలుపెట్టండి. ఈ గదికిటికీ, సమీపంలోని బాల్కనీలో పుదీనా, కొత్తిమీర, మెంతి వంటి వాటిని పెంచితే అక్కడి గాలి పరిశుభ్రమవుతుంది. వాటిని వంటల్లో వాడితే ఆరోగ్యం కూడా. మిగతా గదుల్లో ఇండోర్‌ మొక్కలుంచండి.

సేంద్రియ ఎరువుగా... ఇంట్లోని వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మార్చి, పెరట్లో కూరగాయల మొక్కలకు వాడితే ఆరోగ్యంగా పెరుగుతాయి. రసాయన రహితంగా పండే వీటివల్ల ఇంటిల్లపాదికీ ఆరోగ్యం.
రీసైకిల్‌... ఇంట్లో వృథాగా అనిపించే ప్లాస్టిక్‌ వస్తువుల్లో మొక్కలు పెంచడం, లేదా వేరే అవసరానికి వాడటం చేయాలి. నీటి వృథా తగ్గించడానికి ట్యాప్‌ల పనితీరును గమనిస్తుండటం, దుకాణాలకు వెళ్లినప్పుడు కాటన్‌ లేదా పేపర్‌ బ్యాగులను తీసుకెళ్లడం వంటివీ పర్యావరణ పరిరక్షణలో భాగమే. రోజూ వాడే దువ్వెన, టూత్‌బ్రష్‌ వంటివి చెక్కవే తీసుకోవాలి. వంటకి మట్టిపాత్రలు మంచిది. పెట్రోలు, డీజిల్‌ వంటివి వాతావరణ కాలుష్యానికి కారణం. తక్కువ దూరాలకు సైకిల్‌ వాడండి. ఆరోగ్యానికీ మంచిది, ఖర్చూ తగ్గుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్