వంటగది ఒద్దికగా...

సుమతికి ఉదయం వంటింట్లోకి వచ్చిన వెంటనే చికాకు మొదలవుతుంది. అత్యవసరానికి ఏ వస్తువూ చేతికి దొరకదు. కావాల్సినవాటి కోసం అలమరలన్నీ వెతుకుతుంది

Published : 02 Nov 2021 00:36 IST

సుమతికి ఉదయం వంటింట్లోకి వచ్చిన వెంటనే చికాకు మొదలవుతుంది. అత్యవసరానికి ఏ వస్తువూ చేతికి దొరకదు. కావాల్సినవాటి కోసం అలమరలన్నీ వెతుకుతుంది. దీనికి సులువైన పరిష్కారాలని నిపుణులు సూచిస్తున్నారు..
* పేర్లతో... వంటసరకులకు పారదర్శకంగా ఉండే గాజు సీసాలను ఎంచుకోవాలి. లేదా స్టీలు డబ్బాల్లో వేసుకున్నప్పుడు పేర్లను స్టిక్కర్‌లా పైన అతికించాలి. అలాగే పోపుల డబ్బా ఖాళీ అయినప్పుడల్లా తిరిగి వెంటనే వేసుకోవడం మర్చిపోకూడదు. అంతేకాదు, ఉదయం కాఫీ, టీ లేదా పిల్లలకు పాలల్లో కలిపే పౌడర్లు, చక్కెర వంటివాటిని ఒక చోటే అమర్చుకుంటే తీసుకోవడానికి వీలుగా ఉంటాయి. అల్పాహారానికి వాడే మినప్పప్పు, రవ్వ, గోధుమ పిండివంటి ¨వాటిని ఒకే చోట పెట్టుకోవాలి. దాంతోపాటు వంటకు వినియోగించే కందిపప్పు, పెసరపప్పు, సెనగపప్పు వంటి దినుసులకు ప్రత్యేకంగా అలమరను కేటాయించుకోవాలి. అలాగే వంట పూర్తయిన తర్వాత ఆయా వస్తువులను వాటి స్థానాల్లో ఉంచితే పని సులువవుతుంది.
* శుభ్రత... వంటింట్లో పని పూర్తయిన వెంటనే టిష్యూతో పొయ్యి, దిమ్మను శుభ్రం చేసుకోవాలి. రాత్రిపూటే క్లీన్‌ చేసుకుంటే తెల్లారిన తర్వాత వంట చేయడానికి ఉత్సాహంగా అనిపిస్తుంది. కిటికీ పక్కగా కొత్తిమీర, పుదీనా, మెంతి, తోట కూర వంటి వాటిని కుండీల్లో పెంచాలి. దీనివల్ల పర్యావరణ పరిరక్షణ మాత్రమే కాకుండా వంటల్లో, సలాడ్స్‌లో అప్పటికప్పుడు వినియోగించడానికి ఉపయోగపడతాయి. అంతేకాదు, ఇవి వంటింటికి ఫ్రెష్‌ ఫీలింగ్‌ వచ్చేలా చేస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్