పండగవేళ.. ఇంటిని మెరిపిద్దాం!

దీపావళికి ఇంటిని అలంకరించడం మన అలవాటు. ఈసారి ఏదైనా కొత్తగా ప్రయత్నించాలి అనుకుంటున్నారా? వీటిని ఓసారి చదివేయండి.

Updated : 04 Nov 2021 06:35 IST

దీపావళికి ఇంటిని అలంకరించడం మన అలవాటు. ఈసారి ఏదైనా కొత్తగా ప్రయత్నించాలి అనుకుంటున్నారా? వీటిని ఓసారి చదివేయండి.
* కొత్త కళను తెండి: ఒక్కోసారి ఎన్ని హంగులద్దినా కొత్తదనం కనిపించదు. అలాంటప్పుడే రంగులకు ప్రాధాన్యమివ్వాలంటారు ఇంటీరియర్‌ డిజైనర్లు. అలాగని పూర్తి ఇంటి రంగులు మార్చేయమని కాదు. సోఫా ఉందనుకోండి.. కుషన్లకు ఒకే తరహావి కాకుండా విభిన్నమైన రంగుల గలీబులను తొడిగేయండి. సాధారణ రంగులున్న గోడలకు రంగు రంగుల కాగితాల పూలు, అక్షరాలు, చిన్న చిన్న పూసలను అతికించి చూడండి. మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
* ప్రత్యేకంగా..: డెకరేషన్‌ సామగ్రి ఒకసారి తెచ్చింది మరుసటి ఏడాదికి పాతదిగా అనిపించొచ్చు. అలాంటప్పుడు బీరువాలోని దుప్పట్టాలకు పనిచెప్పేయండి. వరుసగానో మెలికలు తిప్పో గోడకు అంటించేయండి. పాడైపోతాయన్న బెంగా ఉండదు. మళ్లీ వాడుకోవచ్చు కూడా. పిల్లలకు పేపర్‌ ఇచ్చి పెయింటింగ్‌ వేయమనండి. వాటిని అంటించి చూడండి. వాళ్లని ప్రోత్సహించినట్టూ అవుతుంది. నయా లుక్కూ దక్కుతుంది.

 

* సహజమైన వాటితో: ఒకప్పుడు పండగలంటే.. పూలూ, తోరణాలే! సిటీల్లో ప్రతి ఇంట్లోనూ మొక్కల పెంపకం సాధారణమైంది. చిన్న చిన్న కుండీల్లోని మొక్కలతోనే  డెకరేషన్‌ చేయండి. ఒక పెద్ద గాజు పాత్రలో నీళ్లు పోసి తాజా పూలను ఉంచండి. వీటిని మధ్యలో, మూలల్లో అంటించి ఉంచండి. మనసుకూ, కళ్లకూ హాయితోపాటు తాజా అందం కూడా!
* గాజు పాత్రల్లో:  లేదంటే.. ఒక చిన్న గాజుపాత్రలో నీళ్లు తీసుకుని వాటిల్లో కొంచెం నూనె పోయాలి. పైన ప్లాస్టిక్‌ కవర్‌కి మధ్యలో రంధ్రం ఉంచి దాని గుండా కిందకి నూనెలో ముంచిన ఒత్తిని వేసి వెలిగించి చూడండి. అడుగున ఒక్కో పాత్రనీ భిన్న కలర్లతో నింపి చూడండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్