వంటగదిలో ఇవొద్దు!

మనం ఎక్కువగా గడిపేది వంట గదిలోనే. అలాంటి చోట కొన్ని వస్తువుల వల్ల ముప్పుంది. మరికొన్ని అక్కడుండంచడం వల్ల పాడవుతాయి. అవేంటో చూడండి... గ్యాస్‌ సిలిండర్‌... అదనపు సిలిండర్‌ను వంట గదిలో ఓ మూలన పెట్టేస్తారు. ఇది సురక్షితం కాదు. దురదృష్టవశాత్తూ అగ్ని ప్రమాదం లాంటిది జరిగితే ప్రాణ, ఆస్తి నష్టాలు ఎక్కువయ్యే అవకాశం ఉంది.

Published : 06 Nov 2021 00:57 IST

మనం ఎక్కువగా గడిపేది వంట గదిలోనే. అలాంటి చోట కొన్ని వస్తువుల వల్ల ముప్పుంది. మరికొన్ని అక్కడుండంచడం వల్ల పాడవుతాయి. అవేంటో చూడండి...

గ్యాస్‌ సిలిండర్‌... అదనపు సిలిండర్‌ను వంట గదిలో ఓ మూలన పెట్టేస్తారు. ఇది సురక్షితం కాదు. దురదృష్టవశాత్తూ అగ్ని ప్రమాదం లాంటిది జరిగితే ప్రాణ, ఆస్తి నష్టాలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ సిలిండర్‌ను బయటే ఉంచండి.

రసాయన ఉత్పత్తులు... క్లీనింగ్‌ కెమికల్స్‌ను వంటగదిలో అరల్లో, సింకు కింది భాగంలో భద్రపరుస్తుంటారు. కొన్ని రసాయనాలు వాతావరణ మార్పులకు, వేడిమికి త్వరగా రియాక్ట్‌ అయ్యి ఒక్కోసారి పేలి పోయే ప్రమాదం ఉంది.

ఆలూ, ఉల్లిపాయలు... ఉల్లి పాయలు, బంగాళాదుంపలు కలిపి వంటగదిలో నిల్వ చేస్తారు. సరైన వెలుతురు, గాలి లేకపోవడం వల్ల ఇవి త్వరగా మురిగి పోతాయి. ఈ రెంటినీ కలిపి అస్సలు నిల్వ చేయొద్దు. ఇలా చేస్తే రెండింటి నుంచి మొలకలు వచ్చేస్తాయి. కాబట్టి వీటిని విడి విడిగా గాలి తగిలేలా భద్రపరిస్తే మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్