కొత్తిమీర తాజాగా!

కొత్తిమీరను కాస్త వేస్తే చాలు కూర, చారు.. ఏదైనా ఘుమఘుమ లాడాల్సిందే. సువాసనలే కాదు దీని ఔషధ గుణాలు ఆరోగ్యాన్నీ ఇస్తాయి. అయితే నిల్వ చేయడంలో పొరపాట్ల వల్ల కొత్తిమీర త్వరగా పాడైపోతుంది. అలా కాకుండా ఉండాలంటే...

Updated : 09 Nov 2021 02:12 IST

కొత్తిమీరను కాస్త వేస్తే చాలు కూర, చారు.. ఏదైనా ఘుమఘుమ లాడాల్సిందే. సువాసనలే కాదు దీని ఔషధ గుణాలు ఆరోగ్యాన్నీ ఇస్తాయి. అయితే నిల్వ చేయడంలో పొరపాట్ల వల్ల కొత్తిమీర త్వరగా పాడైపోతుంది. అలా కాకుండా ఉండాలంటే...

* చాలామంది కొత్తిమీర తేగానే కడిగి ఫ్రిజ్‌లో పెట్టేస్తారు. అయితే నీరు, తేమంతా పోయాకే నిల్వ చేయాలి. ఫ్యాన్‌ కిందో, గాలికో ఆరబెట్టాలి. మరో చిట్కా... తెచ్చినదాన్ని అలాగే నిల్వ చేసి వాడే ముందు శుభ్రం చేస్తే సరి.

* చాలామంది కొత్తిమీరను వేర్లతో సహా నిల్వ చేస్తారు. దీనివల్ల వేర్లకున్న తేమ కాడలకు పాకి త్వరగా కుళ్లిపోతాయి. కాబట్టి వేర్లను, కాస్త మందంగా ఉండే కాడలను కోసేయాలి.

* ఫ్రిజ్‌లో మూత లేకుండా గాలి తగిలేలా పెడితే కొత్తిమీర వడలిపోతుంది. దాని వాసన మిగతా పదార్థాలకూ పాకుతుంది. కాబట్టి ఓ పాత్రలో వేసి మూత పెట్టాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్