జుట్టు చిట్లకుండా...

తలస్నానం చేసిన తర్వాత జుట్టును మెలేసి తువ్వాలు చుట్టేయడం, స్ట్రెయిట్నింగ్‌, కలరింగ్‌ వంటివి, తడిగా ఉన్నప్పుడు దువ్వడం, రసాయనాలు కలిసిన షాంపూ, కండిషనర్‌ వంటివి వాడ్డం వల్ల శిరోజాల్లోని తేమ పోతుంది. దాంతో పొడారినట్లుగా మారి చివర్లు చిట్లి పోతుంటాయి.

Updated : 09 Nov 2021 02:12 IST

తలస్నానం చేసిన తర్వాత జుట్టును మెలేసి తువ్వాలు చుట్టేయడం, స్ట్రెయిట్నింగ్‌, కలరింగ్‌ వంటివి, తడిగా ఉన్నప్పుడు దువ్వడం, రసాయనాలు కలిసిన షాంపూ, కండిషనర్‌ వంటివి వాడ్డం వల్ల శిరోజాల్లోని తేమ పోతుంది. దాంతో పొడారినట్లుగా మారి చివర్లు చిట్లి పోతుంటాయి.

* మాడుకు అంటకుండా... షాంపూ వేసిన తర్వాత పూర్తిగా పోయేవరకు నీటితో శుభ్రం చేయాలి. తర్వాత రసాయనరహిత కండిషనర్‌ను శిరోజాలకు పట్టించాలి. దీన్ని మాడుకు అంటకుండా జాగ్రత్తగా రాసి, పది నిమిషాల్లోపు శుభ్రం చేస్తే చాలు. తడిగా ఉన్నప్పుడు కేశాలు చాలా సున్నితంగా ఉంటాయి. తేలికగా తెగిపోయే లేదా చిట్లి పోయే స్థితిలో ఉంటాయి. ఆ సమయంలో మాడుపై ఉన్న చర్మరంధ్రాలు తెరుచుకుని ఉంటాయి. అప్పుడు దువ్వితే జుట్టు బలహీనపడుతుంది. అందుకే తడి జుట్టును మృదువైన తువ్వాలుతో తుడిచి, సాధారణ వాతావరణంలో ఆరబెట్టుకోవాలి. రెండు చుక్కల ఆర్గానిక్‌ సీరంను వేళ్లపై వేసుకుని శిరోజాలకు మాత్రం అంటేలా రాస్తే మంచిది. తర్వాత ప్లాస్టిక్‌ దువ్వెనతో కాకుండా చెక్క దువ్వెనతో దువ్వితే చాలు. 

* రెండు నెలలకోసారి... 6-8 వారాలకొకసారి జుట్టు చివర్లను ట్రిమ్‌ చేసుకుంటుండాలి. దీంతో చివర్లు పెరుగుతుంటాయి. చిట్లిపోయే ప్రమాదం నుంచి బయటపడతాయి. ఆర్గాన్‌, మోరోక్కాన్‌, కొబ్బరి, బాదం నూనెలను సమానంగా తీసుకుని, వాటిలో రెండు చెంచాల చొప్పున కలబంద గుజ్జు, తేనె, గుడ్డు తెల్ల సొనను కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడు నుంచి కురుల చివర్ల వరకు రాసి ఓ అరగంట ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లని లేదా గోరువెచ్చని నీటితో మాత్రమే తలస్నానం చేయాలి. ఈ సూచనలు పాటిస్తే.. పట్టుకుచ్చులాంటి శిరోజాలు మీ సొంతమవుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్