రెండు వారాలు... తాజాగా!

ఆకుకూరలు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి వీటిని తరచూ ఆహారంలో చేర్చుకోవాలి. అయితే ఎక్కువ మొత్తంలో వీటిని నిల్వ చేసినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కుళ్లిపోతాయి. అలా కాకుండా రెండు వారాలపాటు నిల్వ ఉంచే చిట్కాలివి..

Updated : 16 Nov 2021 05:52 IST

ఆకుకూరలు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి వీటిని తరచూ ఆహారంలో చేర్చుకోవాలి. అయితే ఎక్కువ మొత్తంలో వీటిని నిల్వ చేసినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కుళ్లిపోతాయి. అలా కాకుండా రెండు వారాలపాటు నిల్వ ఉంచే చిట్కాలివి..

కాగితం సంచుల్లో...

ఆకుకూరలను కొన్నాక ముందుగా వాటిని నాలుగైదు సార్లు శుభ్రంగా నీళ్లతో కడగాలి. ఆ తర్వాత ఆరబెట్టి పేపర్‌ బ్యాగులో వేసి ఫ్రిజ్‌లో భద్రపరచాలి. అయితే బ్యాగును పూర్తిగా మూసిపెట్టకుండా తెరిచి ఉంచితేనే మంచిది. ఇలా చేస్తే చాలారోజులు తాజాగా ఉంటాయి.

గాలి చొరని డబ్బాల్లో...

కాడల నుంచి ఆకులను తుంచి శుభ్రమైన పెద్ద గిన్నెలో వేయాలి. ఇప్పుడు ప్లాస్టిక్‌ బాక్స్‌లో ఓ పేపర్‌ టవల్‌ వేసి దానిపై ఆ ఆకులను వేసేయాలి. వీటిపై బ్రెడ్‌ స్లైస్‌లను పెట్టాలి. ఇవి ఎక్కువగా ఉండే తేమను పీల్చేస్తాయి. ఇప్పుడు ఆకులను పూర్తిగా పేపర్‌ టవల్‌తో కప్పేయాలి. వారంలో ఒకసారి పేపర్‌ టవల్‌, బ్రెడ్‌ ముక్కలను మార్చేస్తే సరి. ఇలా రెండు వారాల వరకూ నిల్వ చేయొచ్చు.

గుర్తుంచుకోండి...

* వడిలిపోయినవి, పసుపు, ఇతర రంగుల్లోకి మారిన ఆకుకూరలు ఎంచుకోవద్దు.

* ఆకుకూరలను జిప్‌లాక్‌ బ్యాగులో భద్రపరచాలి. లేదా న్యూస్‌పేపర్‌లో చుట్టి కూడా నిల్వ చేయొచ్చు.

* యాపిల్‌, అరటి పండ్లతో ఆకుకూరలను కలిపి నిల్వ చేయొద్దు. త్వరగా కుళ్లిపోతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్